అమ్మ

అమ్మ

రచన:: చెరుకు శైలజ

చిన్నప్పటి నుండి చూసేదాన్ని అమ్మ అసలే నల్ల రంగు బట్టలు వేసుకునేది కాదు.ఏ చీరలో నైన చిన్న నల్ల అంచు వున్నవద్దు అనేది . తెల్లగా వుండే అమ్మ నల్లరంగు చీర కట్టుకుంటే ఎంత అందంగా వుంటుంది కదా అనుకునే దాన్ని. అమ్మ నీవు ఎందుకు నల్ల రంగు వెసుకోవు అని అడిగాను. దానికి అమ్మా ఏమి జవాబు చెప్పలేదు.ఇంక నేను మరలా అడగడం మానేశాను.ఒకసారి మా ఇంట్లో ఏదో ఫంక్షన్ వుంటే అందరు మా అన్నయ్యలు, అక్కయ్యలు వచ్చారు. అందరు భోజనం చేసి సరదాగా మాట్లాడుకుంటు కూర్చున్నాం. అక్కయ్యలు తాను కొనుక్కున్న చీరెలు చూపెట్టుకుంటున్నారు. మా పెద్ద అక్కయ్య తాను తెచ్చుకున్న నల్ల పోచంపల్లి చీరను చూపెట్టింది. అబ్బా ఎంతో బాగుంది అన్నాను. మన అందరికి నల్ల రంగు ఇష్టం కదా, మరి అమ్మ ఎందుకు నల్ల రంగు వేసుకోదు అన్నాను. ఏమైనా సెంటిమెంట్ వుందా అని అడిగాను. దానితో మా అక్క నాకు తెలిసి విజయ పోయిన దగ్గరి నుండి అమ్మ నల్ల రంగు వేసుకోకపోయేది.విజయ ఎవరు అని అడిగాను. విజయ నీకు అక్క అవుతుంది. నాకు చెల్లెలు అంది. అవునా నాకు ఇంకో అక్క వుండేనా విజయ అనే పేరుతో ఆశ్చర్యం గా అన్నాను.అవును చాలా అందంగా తెల్లగా ఎత్తుగా పెద్ద నల్లని జుట్టు తో ఎంత బాగుండేది.దానికి ఏం రంగు వేసిన దిష్టి తగిలేది .మరి ఎలా చనిపోయింది అన్నాను.ఆ రోజు మన ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంది . హడావుడి గా వుంది ఎవరి పనుల్లో వాళ్ళు వున్నారు.విజయ అపుడు దానికి 5ఏండ్లు వుంటాయి. మంచిగా తలస్నానం చేసి నల్ల రంగు లంగా జాకెట్ వేసుకొని ఆ ఇంటి పక్కనే పశువుల కొట్టాం లోకి వెళ్ళింది. అపుడు ఆ కొట్టాం లో పెద్ద మోట బావి వుండేది.ఇంక అక్కడ మన పనివాళ్ళు ఏదో పని చేస్తున్నారు . అక్కడ ఆడుకొని ఇంట్లోకి వచ్చింది .అంతే విపరీతమైన జ్వరం, వాంతులు దవాఖానాకు తీసుకెళ్లే లోపు ప్రాణం పోయింది. ఆ టైం లో దవాఖానకు తీసికెళ్ళిలి అంటే బస్సు సౌకర్యం వుండేది కాదు. బండి కట్టుకోని వెళ్ళాలి .ఆ బండి తయారు చేసేలోపే ప్రాణం వదిలింది. ఆ రోజు అమ్మ బాధకు అంతులేదు .చాలా ఏడిచింది . కొన్ని సంవత్సరాల వరకు మనిషి కాలేదు.అమ . విజయ నల్ల రంగు వలనే దిష్టి తగిలి పోయింది అని అనుకుంది. అప్పటికినుండి నల్ల బట్టలువేసుకోలేదు. అమ్మ తన గుండే లో అంత బాధను దాచిపెట్టుకుందా,అంతటి ఆవేదన మనసులోనే అనుభవించింది అంది.మా అక్కయ్య చెప్పాడం వలన ఆ విషయం తెలిసింది. తాను మాత్రమే ఆ రంగును వదిలివేసింది. మాకు ఆ విషయం చెప్పాలేదు.. అది అమ్మ గొప్పతనం. ఎప్పుడైనా బయటకు వెళ్లి వచ్చి తలనొప్పి అని పడుకుంటే దిష్టి తీసి అలా రఫు మనే రంగులు వేసుకోకు అని చెప్పేది. కాని ఆంతాకన్న వేరే ఏమి నిబంధన పెట్టేది కాదు. అమ్మ నీవు నల్ల రంగుని వదిలివేశావు, మరి మాకు ఎందుకు చెప్పలేదు. వేసుకోవద్దని అడిగాను. ఆ సంఘటనను మీకు చెప్పి మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టంలేక అంది. నల్ల రంగు మంచిదే కాని, నాకు అలా జరగడం వలన, నేను నా బిడ్డ గుర్తు గా వదిలివేశాను. దానికి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అంది. వెంటనే అమ్మ నీ అంత చల్లని మనసు ఎవరికి వుంటుంది అంటు గట్టిగా వాటేసుకున్నాను.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!