చీమలచరిత్ర

చీమలచరిత్ర
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: యాంబాకం

 మానవుడు దేవుడు తో మాట్లాడి నాడో లేదో తెలియదు కానీ! చీమ శివుని వద్దకు పోయి ఒక వరం అడిగినందట స్వామి నేను కుడితే మనుషులు చనిపోవాలి అని? అంత తెలివి గల చీమల గురించి మనకు తెలియని విషయాలు బోలెడు ఉన్నాయి.
చీమలను చూడని వాళ్ళు ఉండరు. మనం నిత్యం చూస్తూనే ఉంటాము అలా చూసే చీమలలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఎర్రచీమలు, నల్లచీమలు, రెక్కల చీమలు గండుచీమలు వీటిలో కూడా చిన్నవి పెద్దవి ఉన్నాయి. నల్లచీమలు కుట్టవు ఎర్రచీమల్లో చిన్నవి, పెద్దవి కుట్టుతాయి కానీ పెద్ధవి కుట్టితే దద్దులెక్కి చాలా బాధ పడుతుంది. గండు చీమలు కుట్టవు గాని పీకుతాయి ఇవి పీకిన చోట రక్తం కూడా వస్తుంది. ఇంచు మించు ప్రతి దోడ్డి లోకాని కాలీ చల్లని చోటు ఉంటే అక్కడ చీమల పుట్ట ఉంటాయి. చూడక మనం వాటి పుట్ట మీద కాలు వేసామా మనని కుట్టి పీకేస్తాయి.ఇవి ఇంట్లో కూడా గొడ కన్నలలోను నేల పగుళ్లలలోనూ.అవి ఉండటంచూస్తూ ఉంటాము అంత కంటే మనకు చీమలను గురించి ఏమీ తెలియదు.కానీ వాటిని గురించి తెలుసుకోదగిన అంశాలు అనేకం ఉన్నాయి. ఈ విషయాలను ఎందరో పరిశీలకులు గమనించారు. ఏ ఒక ప్రాంతంలో నైనా కొన్ని రకాల చీమలే ఉంటాయి.కానీ “ప్రపంచం మొత్తం మీద 8 వేల రకాల చీమలున్నాయి. ఒక్క బెల్జియన్ కాంగోలోని చీమలను గురించి  1139 పేజీలు ఉన్న పుస్తకం ఉంది. భూమి పైన ఉండే చీమ, సంఖ్య మనం ఊహించలేం, ఏ ఇతర జీవరాశి కూడా అంత సంఖ్య లో  లేదని చెప్పవచ్చు. చీమలలో సాముదాయక జీవితం ఉన్నది. వాటికి ఒక “నాగరికత ఉన్నది. అవి ఉత్పత్తి చేస్తాయి. యుధ్ధాలు చేస్తాయి. ఒక్కొక్క రకం చీమలకు  ఒక్కొక్క వాసన ఉంటుంది. చీమలు తమ వాసన లేని ఇతర చీమల తో హోరా హోరా యుధ్ధాలు చేయగలవు.వాటి “నగరాల” పై దురాక్రమణ చేయగలవు.అనేక విషయాలలో వాటి జీవిత విధానం మానవ జీవితాన్ని స్ఫూరింపజేస్తుంది. కొన్ని రకాల చీమలు బోరకలలో ప్రవేశించి ఇతర దేశాలకు వలస వెళ్ళాయి.ఈ విధంగా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వలస వెళ్ళిన చీమల జాతులున్నాయి. భూమి పై 30 లక్షల ఏళ్ల క్రితం జీవించిన చీమలను కూడ మనం ఈనాడు చూడవచ్చు. ఆ కాలంలో ఉండిన దేవదారు వృక్షాల బంక లో ఈ చీమలు చిక్కుకు పోయాయి. ఆ బంక ఇప్పుడు మనకు తృణమణి రూపంలో దొరుకు తున్నది. తృణమణి గాజులాగా ఉంటుంది. కనుక దాని లోపల ఉండే చీమను మనం చూడవచ్చు.
వాన కురిసిన మరుసటి రోజు మనం దొడ్డి లోకి వెళ్లి ఏదైనా రాయిని ఎత్తి నట్టుయితే దాని కింద అనేక చీమలు కనిపిస్తాయి. అవి అటూ ఇటూ చెల్లా చెదురు. గా పరిగెత్తుతాయి. ఇవి పని చేసే చీమలు. “శ్రామికులు” వీటి మధ్య లో పెద్ధ ప్రమాణం గల చీమ కనిపంచి నట్టుయితే అది “రాణి”రాణి ఆడచీమ మిగిలిన చీమలన్ని  దాని సంతానం శ్రామికులు అభివృద్ధి చెందని ఆడచీమలు, మగచీమలు చాలాచిన్నవి గా ఉంటాయి. ఆడ చీమలకు  గర్భాధారణ జరిగే తరుణంలో తప్ప అవి పుట్టలలో కనిపించవు. “వలసవెళ్ళేరాణి”భవిష్యత్తులో” రాణి చీమలకు పుట్టింట చాలా సౌకర్యాలుంటాయి.  దానికి చీమలు ప్రత్యేక మైన ఆహారం ఇచ్చి గారాబంగా పెంచుతాయి. అది బాగా పుష్టిగా ఉండి చాలా ఆహారాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. దానికి రెక్కలు ఉంటాయి. గర్భాధారణ కాగానే రాణి తన పుట్టింటిని వదలి ఎగురుతూ వెళ్లి వేరోక చోట నివాసం ఏర్పరచు కుంటుంది. ఇలా ఎగిరి వెళ్ళినాక దానికి రెక్కలతో పని ఉండదు. రాణి ఏ చెట్టు బెరడు వెనుకనో రాయికిందనో సందు చూసుకుని. అక్కడ తనకూ తనకుకలగబోయే పిల్లలకూ నివాసం ఏర్పాటు చేరుకుంటుంది. ఒక్కోసారి అది చెట్టు బెరడు నమిలి దాని తో కాగితం లాంటిది. తయారు చే సిదాని చాటున వసతి ఏర్పాటు చేరుకుంటుంది. ఇక రెక్కలలో పని లేదు గనుక వాటిని రల్చేస్తుంది.  లేదా కొరికి పారేస్తుంది. వాటిని కదిలించే కండరాలు దానికి అదనపు ఆహారం నిలువగా ఉపయోగిస్తాయి. తరువాత “రాణి మొదట విడత గుడ్లు పెట్టి పిల్లలను చేసి తన పొట్టలో ఉన్న ఆహారాన్నే వెలికి తెచ్చి వాటికి తినిపిస్తుంది. మొదట విడత పిల్లలు దుర్బలంగా గిడస బారి ఉంటాయి.  అయినా వాటికి ఆహారం తీసుకురా వటం తెలుసును అవి తమ తల్లికీ తమకూ విడతలు విడతలు గా పుట్టకు వచ్చే చెలేళ్ళకూ కావలసిన ఆహారం వెతికి పట్టు కొస్తాయి. ఆనాటి నుంచి పిల్లలు వెతికి తెచ్చే తిండి తింటూ కదలకుండా కూచుని వరసగా పిల్లలను పెట్టటం తప్ప రాణి కి మరొక పని ఏమీ లేదు అయితే రాణి చీమలు కొత్త నివాసాలు ఏర్పరచు కోవటంలో కొద్ది కొద్ది తేడాలున్నాయి. ఆసియాలోనూ ఉత్తర ఆఫ్రికా లోనూ నివాసం ఏర్పాటు చేయటానికి వచ్చేటప్పుడు దాని కాళ్ళను నీళ్లతో కరుచుకొని “శ్రామిక చీమలు” కొన్ని వెంట వస్తాయి. కొత్త గూడు తాలూక పనులన్నీ అవే చేస్తాయి. కొన్ని రకాల రాణి చీమలు పనివాళ్ళను వెంట తెచ్చుకోవు తమ మొదటి విడత పిల్లలను తాము సంరక్షించనో లేవు. అందుచేత అవి ఇంకొక జాతి చీమల పుట్ట పైన దాడి చేస్తాయి. ఒక రకం రాణి చీమ తన జాతికి సన్నిహిత మైన మరొక జాతికి చెందిన చీమల పుట్టలో ప్రవేశించి అక్కడ ఉన్న గుడ్లన్నిటిని పోగుచేసి లాగేసుకొని అక్కడ చీమల తో పోట్లాడుతుంది. ఆ గుడ్ల నుంచి వచ్చే చీమలన్ని తమను తస్కరించిన రాణికి విధేయత కలిగి ఉంటాయి.అవి రాణి కి దానికి పుట్టే పిల్లలకు కూడా సేవ చేస్తాయి. ఇలాంటివి పుట్టలలో రెండు రకాల చీమలు కలసి జీవించుట జరుగుతుంది.
“ఫార్మకా” అనే జాతి చీమల రాణి చాలా చిన్నది దీని శరీరం నిండా మందంగా పసుపుపచ్చ నూగు ఉంటుంది. ఇది కొత్త కాపరంపెట్టటానికి బయలుదేరి తనకు సన్నిహితమైన మరొక రకం చీమల పుట్టలో ప్రవేశించి ఎలాగో  పనివాళ్ళ కూడ కలుపు కోంటుంది. ఆ పైన ఆ పనివాళ్ళు తమ సొంత తల్లిని హత్య చేసి ఈ కొత్త రాణికి ఆమె సంతానానికి ఊడిగం చేస్తాయి. కొద్ది కాలంలో నే ఆ పుట్టలో ఉండిన పాత రకం చీమలన్ని చచ్చిపోయీ పుట్ట కొత్త చీమల పుట్ట అవుతుంది. ఉత్తర ఆఫ్రికాలో తలలు తీసే జాతి చీమలున్నయి. ఈ జాతికి చెందిన  రాణి కొత్త నివాసిలన్ని వెతుక్కుంటూ తన జాతి కన్న చాలా పెద్ద చీమలు నివసించే పుట్టవద్దకు వెళ్లి దాని ద్వారం వద్ద తారట్లాడుతుంది. పుట్టలో ఉండే “శ్రామిక చీమలు వచ్చి ఈ విజాతి రాణి నిపెట్టుకుని లోపలికి తీసుకు పోతాయి ఏ కారణం చేతనో అవి దాన్ని చంపవు. ఈ రాణి పుట్టలో ఉన్న అసలు రాణిపైన ఎక్కి దాన్ని కంఠాన్ని నరికేస్తుంది.  శ్రామిక చీమలు ఈ కొత్త రాణినీ ఆమె సంతానిన్ని కొలుస్తాయి. కాల క్రమేన పుట్టలో కొత్త రాణి సంతతి మాత్రమే మిగిలిపోతుంది. ఈ విధంగా దోపిడి చేసి బతికే చీమలు స్వయంగా ఇళ్ళు ఏర్పాటు చేసుకోలేవు ఇతర జాతి చీమలను నిర్మూలించి వాటి స్థావరంలో ఆక్రమించుకొంటాయి. “ఎమెజాన్” చీమలు కేవలం యుద్దమే వృత్తి గలవి వీటికి వాడి అయిన ముక్కులు ఉంటాయి. ఇవి “ఫార్మికా” చీమల పుట్టలలో జొరబడి వాటి రాణులను ఈ ముక్కులతో తలలో పొడిచి చంపేస్తాయి. అక్కడి బానిసలుగా తీసుకుంటాయి. ఈ ఎమేజాన్ చీమలు అప్పుడప్పుడూ ఫార్మికా చీమలు పుట్టలపై దాడి చేసి గుడ్లను తమ పుట్టలకు తీసుకువస్తాయి.
“ఫార్మికా జాతి చీమలు సనాతన దారాన్ని అళలంబిస్తాయని చెప్పవచ్చు. అవి కష్టించి పని చేసి తమ ధర్మన్ని తప్పకుండా నడుచుకొంటూ ఇతర జాతుల చీమల దాడులను తరుచు గురి అవుతుంటాయి. అంతేగాక ఇతర కీటకాలు వాటి పుట్టలలో శాశ్వతం గా కాపరాల పెట్టివాటి ఆతిధ్యం పైన జీవిస్తుంటాయి. చీమల నాగరికత లో సనాతన ధర్మం ఇంకొక విధంగా కూడా మనం చూడవచ్చు ఒకే పుట్టలో రెండు రకాలు చీమలు రెండు బాగాలు ఇక్రమించుకొని వీటి జీవితం అవి గడుపు తూ సహజీవనం సాగించటమే గాక సమిష్టి క్షేమాన్ని కూడ సాధించటం కద్దు. చీమకు రెండు పోట్టలుంటాయి ఒక పొట్టలోకి వెళ్ళిన ఆహారం చీమ కడుపు లో జీర్ణమై పోతుంది. రెండవ పొట్ట అందులో ఆహారం సమిష్టి కి చెందినది. తమ వెంట ఉండే అతిథులు ఆహారం అడిగితే తమ బిడ్డలకు లేక పోయినా ఇచ్చేస్తాయి! మనం ఆవులను పెంచి వాటి పాలు పిండుకు తాగి నట్టుగానే చీమలు కూడా తమ ఆవులను పెంచుతాయి. ఇవి చెట్ల వేళ్ళను ఆశ్రయించి చెట్టు మొక్క సారం పైన బతికే గోమార్రలాంటి ప్రాణాలు చీమలు ఈ చీమలను నిమిరితే ఒక తేనె లాంటి ద్రవం ఆహార పదార్థం వెలుడుతుంది. చీమలకు అది మంచి ఆహారం ఎండాకాలం వచ్చి చెట్లలో సారం తరిగి పొయే సమయానికి  చీమలు తమ ఆవులను సారవంతమైన మరొక ప్రదేశానికి చేర్చి అక్కడ మేపుతాయి. “దర్జీ చీమలు అని ఒక రకం వింత చీమలున్నాయి. ఇవి ఆకుల మధ్య గూళ్లు కడతాయి చీమలు కీటకాలన్నిటి లాగే మొదట లార్వా దశలో ఉండి తరువాత ప్యూపా దశలోకి మారి నప్పుడు తమ చుట్టూ సన్నటి దారంతో గూడు అల్లు కుంటాయి సన్నటి దారంతో గూడు అల్లుకుంటాయి. పెద్ద చీమలు ఈ దశలో ఉంటే తమ పిల్లల చేత దారం పోనించి దానితో ఆకులను ఒకదాని కొకటి అంటుకు పోయేలాగు చేసి తమ నివాసాన్ని సురక్షితం చేసుకుంటాయి. దర్జీ చీమలు  సాధారణంగా ఆకుపచ్చగా ఉంటాయి. అవి సామాన్యంగాచెట్ల చిటారు కొమ్మలలో నివసిస్తాయి.
“మంటచీమలు” ఇవి కుట్టి తే శరీరం మంట ఎత్తు తుంది. ఇవి ఎక్కడ బడితే అక్కడ అత్యధిక సంఖ్యలో నివసిసతాయి వీటి సంఖ్య అతి శీఘ్రం గా వృద్ధి అవుతాయి. వీటికి నీటి భయం కూడా లేదు. వరదలు వచ్చి  నప్పుడు తమ రాణి నీ దాని పిల్లలను మధ్య ఉంచి వాటి చుట్టూ తాము బంతి ఆకారంలో తయారు నేల గాని చెట్టుగాని ఉన్నవవైపు దొర్లుకుంటూ పోయాయి. “రాక్షసచీమలు”చీమలలో కూడ “అనాగరిక”.జాతి చీమలున్నియి “రాక్షసి చీమలు ఇవి కేవలం ఇవి వేటాడి జీవిస్తాయి. వీటికి ఒక చివర బలమైన నోరు రెండు చివర విషపు కోరలు ఉంటాయి. ఇవి అధికంగా ఉష్ణ మండలం లో ఉంటాయి. బోలీవియాలో ఉండే ప్రజలు రాక్షస చీమలు వస్తే తమ మొక్క జొన్న పోలాలు వదలి పారి పోతారు. వాటినిఅక్కడివారు.” బునీ చీమలు” అని పిలుస్తారు. వాటి నిడివి అంగుళానికి కొంచెం తక్కువ ఇంత కంటే కూడా పెద్దగాఉంటాయి.  “రాక్షస చీమలు దక్షణ అమెరికా భూమధ్యరేఖ ప్రాంతంలో ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియా లో ఉండే “బుల్ డాగ్ “. చీమలు కూడా భయంకరమైనవి.
వేటాడే చీమలు హెచ్చుగా  చెదలను తింటాయి. ఒక్కొక్కప్పుడు తమ పుట్టలను చెదలు పుట్టి సమీపంలోనే నిర్మంచుకుంటుయి కూడా కొన్ని రకాల చీమలు సేవలు కదలికట్టు కదలీ దారిలో తగిలిన ప్రాణులను నిర్మూలించు కుంటూ పోతాయి. వీటికి కళ్ళుండవు గనుక చిన్న జంతువు పెద్ద జంతువు అన్ని విచక్షణ లేకుండా, దేన్నిపడితే దాన్ని ఎదుర్కకుంటాయి వాటి దారి లో బొరియలు కనిపిస్తే వాటిలోకి దిగుతాయి చెట్లు తగిలి తే వాటిని ఎక్కతాయి. ఆఫ్రికా, దక్షణ అమెరికా లలో అసంఖ్యమైన సిపాయి చీమలు గుంపులు గుంపులు గుంపులుగా సంచారం చేస్తాయి ఏనుగుల వంటి వి కూడ అవి వచ్చేదారికి అడ్డు నిలబడక తొలగిపోతాయట. ఈ యాత్రకు ఏధైన ప్రవాహం అడ్డు తగిలితే అవి ఒడ్డున ఆగిపోయి ఒక దాని కాళ్లు ను మరొక దాని కాళ్లు పెనవేసి ఒక వంతెనలాగా తయారు ఐ వంతెన పూర్తి కాగానే మిగిలిన చీమలు వాటి మీదుగా నడిచి అవతలి ఒడ్డుకు చేరుతాయి. చీమలకు క్రమశిక్షణ పొదుపు  ఐక్యత గుణాలు కలిగి ఉంటాయి.అవి నిత్యా జీవితం “రాణి చీమలు”పిల్లల్ని కనటం తప్ప మరే పనిలేదు. ఈ రాణి చీమలు 17సం//జీవించి పిల్లలను పెట్టి తమ వంశాన్ని వృధ్ధి చేసిన రాణికూడ ఉన్నది. ఇంటిపనులన “శ్రామికచీమలు”.చూస్తాయి. అవి పిల్లలను మేపుతాయి. ఆహరం తెస్తాయి. సాధారణంగా చీమలు ధ్రవా ఆహారంమే తీసుకుంటాయి. పురుగుల ముక్కలను నోట పెట్టుకున్నప్పుడు కూడ అవి అందులో ని సారాన్ని చప్పరించి మింగి పిప్పిని ఉమ్మేస్తాయి. ఈ పిప్పిని ఒక్కొక్కప్పుడు”అతిథులు”ఆరగించేసఅతాయి.
పెద్ద పెద్ద పుట్టలలో జీవించు చీమలు అనేక వేల సంఖ్యలో ఉంటాయి అవి తమ ఆహారం కోసం రోజూ అనేక లక్షల కీటకాలను తెస్తాయట.
ఎడారులలో ఉండే చీమలు ధాన్యపు గింజలను తెస్తాయి వాటిని పిండి చెయ్యటానికి గాను ప్రత్యేకంగా పెద్ధ పెద్ద తలలు గల చీమలుంటాయి. ఇవిశ్రమపడి గింజలన్నింటినీ తమ పెద్ద నోళ్లలో పిండి పట్టి పుట్టలో ఒక చోట పోగువేస్తాయి గింజలు దొరికేతరుణం దాటి పోగానే మిగిలిన “శ్రామిక కులు “ఈ పెద్ద తలల చీమలు కంఠాలు కత్తి రించేస్తాయి. ఇది ఆ చీమలను తప్పు కాదు ఎందుచేతనంటే మళ్ళీ గింజలు దొరికేదాక ఈ పెద్ద తలల చీమలకు పనిలేదు.ఈ లోపుగా పెద్ద తలలు చీమలు తయారుకానే అవుతాయి. అంతకాలము పాత వాటిని మేపటం వృధా! సామాన్యంగా చీమల పుట్టల చుట్టూ కొంత మేర ఏమీ పెరగదు అవతల చీమలకు పనికి వచ్చే గింజలు కాసే మొక్క లుంటాయి ఈ మొక్కలను చీమలు పని పెట్టకుని నాటుతాయని కొందరి నమ్మకం కాని ఇది నిజం కాక పోవచ్చును. తమ పుట్టలో మిగిలి పోయిన తప్పా తాటా తీసుకుపోయి పుట్టకు ఎడంగా చీమలు విడిచి నప్పుడు అందులో ఒకటి రెండు గింజలుండి అవి వానలకు మొలకెత్త వచ్చిన. ఏమైనా చీమల పుట్టల పరిసరాలలో వాటికి పనికి వచ్చే మొక్కలు ఉండటం నిజం. ఆహారం విషయంలో చీమలు ముందు జాగ్రత్త గలిగిఆవాటికి మంచి ఉదాహరణ “తేనేచీమలు వీటిని గమనిస్తే ఇంకొక సారి తెలుసు కుందా! ఒక రకం చీమలు తమకు కావలసిన పాచిని తామే పెంచు కుంటాయి కూడా  ఈ చీమలు ఒక ప్రత్యేక జాతికి చెందినవి అవి తేనే ఆహారం పుట్ట గొడుగుల లాంటిపాచి దాన్ని అవి తామే పెంచుకుంటాయి. ఇవి ప్రతి సాయం కాలమూ బయటికి వెళ్లి ఆ మొక్కు లను పట్టుకువస్తాయి ఒక్కొక్క సారి ఈ చీమలు చెట్ల ను చెట్లనే నిర్మించటం కూడ జరుగుతుంది. ఇలా తెచ్చిన ఆకులను చీమలు నమిలి లేహ్యంలాగా తయారు చేస్తాయి. దీనిపైన తాము తినే సూక్ష్మ మైన పుట్టగొడుగు లను నాటి పెంచుతాయి ఈ పంటను ఎరువు వేసి జాగ్రత్తగా పెంచి కాపాడేపని అంతా చిన్నచీమలదే. ఈ చీమల జాతికి చెందిన రాణి పుట్టిల్లు వదలి వచ్చేటప్పుడు తమకు ఆహారమైన పాచి నలుసు లను (పుట్టగొడుగు లను). నోట కరచు కొని వస్తుంది తాను తొలి చూలు పెట్టే గుడ్లను చితిపి వాటిపైన ఈ నలుసులను ఉంచి పెంచుతుంది. రెండవ విడత పిల్లలు పెరిగి పెద్దవి అయ్యే సరికి వాటి ఆహారం వంట సిద్ధంగా ఉంటుంది. ఇది చీమల జీవిత చరిత్ర.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!