ఆమె

ఆమె

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పద్మజ రామకృష్ణ.పి

ప్రేమంటే రెండు హృదయాల సవ్వడి
అందంగా తీర్చిదిద్దిన మమకారపు పూతోట

ఒకరి మనసులో ఒకరికి కోవెల కట్టి
బంధమనే తాళిని మనువుతో ముడివేసి
సంసారపు బండికి మరో చక్రంగా మారింది

సర్వం దోచావని కాబోలు నిను తనలో
దాచుకుని రూపాన్ని దాల్చింది అమ్మగా

పురిటి నొప్పుల బాధె ఎరుగని నిను
నాన్నగా మలచి పులకించిపోయింది

చిన్నదెబ్బ తగిలితే తల్లడిల్లిపోయే తల్లిగా
మారినా, మొదటి బిడ్డ నువ్వేనంటూ
నువ్వుంటే నీతో గడుపుతూ, చెంత లేకుంటే
నీ జ్ఞాపకాలను తడిమి తరించిపోతుంది

ఎంత పని వత్తిడి ఉన్నా పక్కనబెట్టి
తనని తాను నీ పట్ల నిత్యం నిర్లక్ష్యం
లేకుండా కృషి చేస్తూనే ఉంటుంది

బంధం వీడిపోయే రోజువస్తే తానే
ముందుగా పుణ్యస్త్రీగా కాలం
చెయ్యాలని కోరుకుంటుంది ఆమె.

You May Also Like

One thought on “ఆమె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!