మైత్రీ కరచాలనం

మైత్రీ కరచాలనం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:దాకరపుబాబూరావు

కార్తీక మాసపు చలి చెంగు నిండుగా కప్పుకుందేమో.
సాయం సంజ ఇంకా పొద్దు పువ్వు ముడుచుకోక ముందే
సిగ్గులమొగ్గయిసర్దుకుంటుoది.

రేయి గూట్లో వెన్నెల దీపం వొత్తి మెలుపుకోగానే
మగత తోపుల్లో
తమకంగా తచ్చాడే కునుకు కన్నెకు నిండు సంరంభం.

చిమ్మ చీకటి మడిలో పుచ్చ పువ్వుల పంటలా వెన్నెల రేడు
నిండుగా నవ్వుకునే వేళప్రకృతి మంచు తెరలు కావాలనే కప్పుకుంటుంది.

నిద్ర గట్లను అవలీలగా దాటుకుంటూ
తీరిగ్గా విహరించే కలల కొంగలు మడి అంతా సందడి సందడి చేస్తుంటాయి.

బడలిక పడవెక్కిన అలసిన దేహం విశ్రాంతి తీరానికి
ఓలలాడుతూ కాల ప్రవాహంలో సేదదీరుతూ వుండే విరామ కోనలకు చేరే కాలం
రాత్రితోమైత్రీ కరచాలనం మృదువుగా చేస్తుంది.

You May Also Like

One thought on “మైత్రీ కరచాలనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!