స్వాతికిరణం
రచన: విస్సాప్రగడ పద్మావతి
తొలి పొద్దు పొడుపులో
లేలేత చిగురుటాకులపై
ముత్యమంటి నీటి చుక్కలు
పక్షుల కిలకిల రావాలు
హంగు ఆర్భాటాలతో
తొలిరోజు మొదలైంది
వేకువఝాము ఒంపుసొంపులు
ఎంతసేపులే అని
రవి నడినెత్తి మీద
తాండవం మొదలుపెట్టే
ఎండ పొగరు దించడానికా అన్నట్లు
సంధ్యా కిరణాలు
చల్లని పయ్యెరలతో నేలను
ముద్దాడింది
గగనం రంగులద్దుకుని
కనువిందు చేసింది
గూటికి చేరిన పక్షులు
పిల్లలతో సంబరం
చేసుకున్నాయి
బడి పిల్లలు ఇంటి బాట పట్టారు
నేలను మొత్తం చీకటి ముసిరి
స్వాతి కిరణం కోసం ఎదురు చూసింది.
కలువలు చంద్రునితో ముచ్చట్లు
పూర్తికాకుండానే
సొంపైన తొలికిరణం విరిసింది
***
చాలా బాగా వ్రాసారు పద్మ
👍👍👍👌👌👌👌