అలుపెరుగని పోరాటం..!

అలుపెరుగని పోరాటం..!

రచన: బండి చందు

నిన్నటి వరకు నేనో బందీని
నేటి మొదలు స్వేచ్ఛా విహారిణిని
రెక్కల అలికిడిని అదుపు చేయలేను
దిక్కుల దరిదాపులనైనా చేరలేను
గతాన్ని గాయాలకు నిలయంచేసి
జ్ఞాపకాలలో తేలుతూ బ్రతకలేను
వెంటాడే కబంధ హస్తాలలో చిక్కి
నిత్యం విసిగి వేసారిపోయాను
కాంచే కళ్ళకి శిలనై నిలిచి
ఎవరి ఆనందానికో బానిసనవ్వలేను
రేపటి భవిష్యత్తుని కాంక్షిస్తూ
సుమపు సుమధురాలను వదలలేను
ఈనాటి నా ఈ అలుపెరగని పోరాటం
ఏనాటికేరోజు ముగుస్తుందో మరి…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!