విరహం

విరహం

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

కౌగిలింతతో,
ప్రేమ చిగురింతతో
వేచిచూసా నెచ్చెలి దరికోసం

చల్లదనం లేక
ఉత్సాహం సన్నగిల్లే,
ఎదురుచూసా ఎదపలుకులకు

చిరుచినుకుల తడిసానే
చెలి దరి కోరికాయె,
నీరుకార్చితివి కదే ప్రియా

మబ్బుల ముసుగు వేసింది,
జాబిలి కనపడదాయె,
వెన్నెలాడి చెంతలేక చింతలాయె,

మంచు వాన కురిసింది,
వొణుకు బెణుకు పుట్టింది,
ముద్దుగుమ్మ స్పర్శ లేదాయె

శిరోభారమాయె,
మనసు మోడుబారె,
కరోనాతో జీవనం వగరాయె,
కరచాలనం లేదాయె,
వేచిచూసా చెలి దరి కోసం

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!