ఆడపిల్లను నేను..!!

ఆడపిల్లను నేను..!!

రచన: సూర్యదేవర స్వాతి

ఆడపిల్లను నేను..!!

చిన్నారిగా పుట్టింట సిరుల పంటనయ్యాను..!!

ఎదుగుతూ అందరికి తలలోని నాలుకగా మారాను..!!

పవిట వేసిన నాటి నుండి పడతిగా మారాను..!!

అందెలు పెట్టిన కాలికి మెట్టే తొడిగి ఇల్లాలిగా మారాను..!!

పొదువుకున్న భర్తకి ఇష్టసఖిగా మారాను..!!

గుమ్మానికి పసుపు,కుంకుమాలద్దుతూ గృహలక్ష్మీగా మారాను..!!

ఆకలన్న వేళా అందరికి అన్నపూర్ణగా మారాను..!!

వంశవృద్ధికై సంతానలక్ష్మీ గా మారాను..!!

పసిపాపలు తిరుగాడు ఇంటికి మహాలక్ష్మిగా మారాను..!!

బిడ్డల భవిష్యత్తుకై సలహాదారుగా మారాను..!!

ఇంట అందరి సేవకై సేవకురాలిగా మారాను..!!

నా ఇంట అందరి మనసులు గెలిచి విజయలక్ష్మిగా మారాను..!!

సన్మార్గాన బిడ్డల పెంపు చేసి వారికి

భవిష్యత్తు మార్గం చూపించి పరిపూర్ణ మహిళగా మారాను..!!

ఇన్ని విధాలుగా మారిన నేను మాత్రం

అందరికంటే ఒక అడుగు వెనుకనే ఆగిపోయాను..!!

దానికి కారణం నాకు నేను కూడా చెప్పుకోలేనేమో..!!

ఎందుకంటే ఇది కనపడని నా మనసు అణిచివేత..!!

ఇన్ని విధాల మార్పులలో….

ఎక్కడో ఒకచోట జరిగిన నా మనసు విరుపు…

ఎవరికి కనిపించని చీకటిలోకి వెళ్ళిపోయింది..!!

అది కేవలం నాకు,నా మనసుకి మాత్రమే తెలుసు..!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!