ఒంటరి పయనం

ఒంటరి పయనం

రచన: ఐశ్వర్య రెడ్డి గంట

సుడిగుండంలో చిక్కుకున్న
బయటికి వచ్చే దారి లేక
కోరికల ఆగాదంలో కొట్టుకొని పోతున్న/
ఓదార్పు కరువై వేదనతో గుండె బరువై
వేల చూపులకు అపహాస్యం కాలేక
అంతులేని ఆలోచన లతో కృశించి పోతున్నా/
సంఘం అనే సముద్రంలో పరువు అనే ప్రహరీ గోడలో నలిగిపోతున్న /
నా బాధ తీర్చే వారు లేక జీవితం అనే నావాలో
చేసే పయనం మూగ పోగా రెక్కలు విరిగిన పక్షినై లోలోపల కుమిలిపోతూన్న/
పైపైకి ప్లాస్టిక్ నవ్వులతో పరిమళిస్తున్న/
అంతం లేని ప్రశ్నల ప్రవాహంలో జవాబు కరువై ఆది లోనే ఒంటరినై నిలుచున్న/
నేను నా మనసు తో అంతులేని పోరాటం చేస్తూనేఉన్నా/

***

You May Also Like

One thought on “ఒంటరి పయనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!