(అంశం::”చిత్రం భళారే విచిత్రం”)
నడిపించే చిత్రం
రచన:: క్రాంతి కుమార్ (ఇత్నార్క్)
కదిలే బొమ్మలు కావవి
నీలో అడుగంటిన సంతోషాన్ని
నువ్వు మర్చిపోయిన నీ నవ్వును
నీకు గుర్తు చేసే ఆత్మీయ నేస్తాలు
పలికే మాటలు కావవి
మదిని తడిమే అనుబంధాలు
కాలాన్ని తిరగరాసే కలాలు
చరిత్రలో నిలిచిపోయే జ్ఞాపకాలు
వినిపించే రాగాలు కావవి
నిరాశకు ఉత్సాహాన్ని నింపే ఉల్లాసాలు
మనసుకు హాయినిచ్చే మధురిమలు
బాధని మైమరపించే ఔషధాలు
కల్పిత చిత్రాలే కావచ్చు
జరిగిన గతాన్ని నీ కళ్ళకు చూపిస్తుంది
జరగబోయే భవిష్యత్తును చెబుతుంది
అందరి మనసుల్లో చెదరని ముద్రను వేస్తుంది
***