(అంశం::”చిత్రం భలారే విచిత్రం”)
ఎంత చిత్రం నా బ్రతుకు
రచన:: బండి చందు
ఇక ఈ పోరాటం నే చేయలేను
నా రుదిరమంత స్వేదమై
నా కంటనీరు సంద్రమై
మూడు పదుల వయసు మీద పడి
తిండిలేక మండుటెండలో నడిరోడ్డుపై
తిరిగిన పాదాల అలసటకు అంతమేది
బంధువుల బడాయిలకు అదుపేది
ఏం చేస్తున్నావ్ అని అడిగే
ఆత్రపు నోళ్ళకి సమాధానమేది
ఇరుగుపొరుగు ఇళ్లలోన నే వినలేని
గుసగుసలను మరిచిపోయే దారేది
నిత్యం నిరాశల ఊబిలో కూరుకుపోయి
అన్నం పెట్టేటప్పుడు అమ్మని
కాసులకై చేతులు చాపి నాన్నని
తల దించుకు చూసే దుస్థితి నాకింకెన్నాళ్లు…
***