కడుపు తీపి

కథ అంశం: బంధాలు అనుబంధాలు-2080

కడుపు తీపి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం. వి. ఉమాదేవి

వ్యాస టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో జనం కిక్కిరిసి ఉన్నారు.. కొందరు సొంత బిడ్డ కోసం అయితే ఎక్కువ మంది కృత్రిమ శిశువుల కోసం. మాములుగా అయితే ప్రతి పనికి, రోబో లున్నాయి.. కానీ మేథస్సు కోసం మానవ శిశువు అవసరం తప్పనిసరి.

ఎప్పుడో 2020లో కూడా మాములుగా పెళ్లి అనే తంతుతో, జంటలు బిడ్డ ల్ని సహజం గా కనే వాళ్ళట. రానురాను వేగం గా గడిచే జీవితం లో ఆ అవసరం లేక, సహజీవనం అనే పద్ధతి లో ఉన్నాక.. కొన్నేళ్ల లో అది చాలా స్వార్థపూరితమై మహిళల కీ, పురుషులకీ మోస పోవడం జరుగుతుంది. అందుకే నడివయసొచ్చాక తన కంటూ ఒక విశ్వసనీయ తోడు కోసం బిడ్డల్ని తెచ్చి పెంచుతూ ఉన్నారు.

జైసి తనకీ పిలుపు రావడంతో కన్సల్టెంట్ రూములో కెళ్ళింది.. అసలు పెషేంట్ కి నేరుగా ఆన్లైన్ సేవలున్నా కూడా… నమ్మకం లేని పరిస్థితిలో పాత పద్ధతులు పాటిస్తూన్నారు. జైసి తెచ్చుకున్న సీరియల్ నెంబర్ కిడ్ కిపుడు నాలుగేళ్లు. మాటలు మేథస్సు సూపర్ గా ఉన్నాయి. తనపని తాను చేసుకోగలడు కూడా.. ఆశిశువు ఎగ్ డోనర్ జైసి నే..
అయినా కూడా వాడిలో మమ్మీ, మామ్ అనే అనుబంధం లేదు. కొన్ని పాతఆన్లైన్ పుస్తకాలలో ఉన్న స్టోరీస్ లో లాగా..తనను చూసి పరిగెత్తి రావడం, హత్తుకునేది ఏమి లేదు. జైసి కెందుకో అలా ఉంటే బాగుండును అనిపిస్తుంది. అదే కిడ్ కి ఆ మార్పులు ఎలా వస్తాయి అని అడగాలి అనే ఇప్పుడు డాక్టర్ దగ్గరకొచ్చింది.
ఇక్కడ జాతరలో ఉన్నట్టు జనం.

“ప్లీజ్ జైసి కమిన్ మై రూమ్ “చెవిలో మాట వినటo తో లోపల కెళ్ళింది.
అక్కడ డాక్టర్ రాక్ తన రిపోర్ట్ లన్ని చూసి..
“మీ ప్రపోజల్ సాధ్యం కాదేమో మిస్ జైసి. కొన్ని దశాబ్దాల క్రితమే అంతరించిన బంధాలు ఇప్పుడు ఎలా ఉంటాయి.. దానికి కొన్ని తెగలుగా కుటుంబ వ్యవస్థ అనేది అప్పుడు వుండేది. సైన్స్, హిస్టరీ, మెడికల్ గా కూడా చాలా డెవలప్ అయిపోయాక వెనక్కి వెళ్లడం హాస్యా స్పదం. కాకుంటే ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ లు, గ్రూప్ లు ఉన్నాయా? ఏ ఫెర్టిలిటీ సెంటర్ లోనో పుట్టడం.. దత్తత వ్యక్తి తో వెళ్లి టీనేజ్ తర్వాత స్వతంత్రo గా డెవలప్ కావడం.. అత్యంత వేగం గా ఉన్న పరిణామాలు.. ఓయో రూమ్స్ కోట్ల సంఖ్య లో దేశం లో ఉన్నపుడు.. స్థలాలు పొలాలు, రిజిస్టర్ కావడం న్యూసెన్స్ కదా.. కుటుంబ వ్యవస్థ కూడా అంతే.. కోరి చిక్కుల్లో పడటం ఎందుకు? వ్యక్తి స్వేచ్ఛ కి అడ్డం అనే ఆనాడు ఆ వ్యవస్థ పోయింది. ఒక దేశం, దేశభక్తి అనేవి ఉండేవట అప్పుడే… ఇప్పుడు విశ్వమ్ మొత్తం ఒకటే అయింది కదా… ఒక ప్రాంతం లో పద్ధతి కావాలి అంటే.. ఇంకా అలాంటి ప్రోగ్రామ్ లు టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ లో బిగిను కాలేదు. మీది మొదటి కేస్ గా.. విస్తృత చర్చ, పరిష్కారం ప్రయత్నం చేస్తాము. బెస్టాఫ్ లక్. “అన్నారు డాక్టర్ రాక్.

” థాంక్స్ సర్. రూట్స్ అనే చాలా పురాతన బుక్ ఒకటి లాస్ట్ వీకెండ్ ట్రిప్ లో ఒక మౌంటెయిన్ దగ్గర దొరికింది.. అది గుహలలోపలి భాగం లో దొరకడం వల్ల అక్కడ స్టలగ్ మైట్స్ తో చల్లగా ఉన్నందుకు పుస్తకం పాలిథిన్ కవర్ లో ఉన్నందున ఏమాత్రం చెడ లేదు. సరదాగా రూమ్ కి తెచ్చి చదువుకున్నా.బహుశా నా జీన్స్ లో బుక్ రీడింగ్ ఏడు తరాలు ముందు ఉందేమో.. ఆ బుక్ లో వ్యక్తి.. తన ముందు తరాలమీది ప్రేమ, అభిమానం తో అనేక ప్రయత్నాలతో తన పూర్వులు బానిస లూ అయినవారి గురించి తెలుసు కోవడం.. చాలా హార్ట్ టచ్ గా ఉంది.. అంత అక్క ర్లేదు.. ఒక వ్యవస్థ లో ఇంకో మనిషి మన కోసం ఆలోచన, ఆప్యాయత, చూపేది చాలా బాగుంది అనిపించింది. బై డాక్టర్ !”అంటూ వెళ్ళింది జైసి.

“భూమి గుండ్రంగా ఉంది “అని ఆలోచన లో పడ్డాడు డాక్టర్ రాక్.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!