ప్రేమ పెళ్లి అనుబంధము

ప్రేమ పెళ్లి అనుబంధము
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు ప్రకృతిని మానవాళిని క్షేమంగా పరిరక్షిస్తూ విశ్వాన్ని నడిపిస్తున్నాడు.
యశోధర్ మంచి అందగాడు అనే చెప్పాలి అయితే వచ్చి వచ్చి పల్లెటూరులో పుట్టి, పల్లెటూరు పద్దతులు గౌరవిస్తూ ఉన్న పది ఎకరాల పొలం చూస్తూ ఆధునిక పద్దతిలో వ్యవసాయం చేస్తూ అక్కల ఇద్దరు పెళ్ళిళ్ళు ఘనంగా చేశాడు.
పెద్దలు అంతా ఉన్నారు తాత బామ్మ తల్లి తండ్రి అంతా ఉండి మంచి కుటుంబంగా ఉన్నారు. మనమడు చదువుకుని కొత్త పద్దతిలో వ్యవసాయం చేస్తున్నాడు పూర్వం కంటే దిగుబడి బాగుంది కానీ కూలి వాళ్ళకి ఉపాధి పోయింది అని నాలుగు అయిదు సార్లు అనుకున్నారు పెద్దలంతా, కానీ మారే కాలంతో పాటు మారాలి. భూమాత పై మనవవులకు ప్రేమ ఎంతో కదా.
పెద్దవాళ్ళు పిల్లలని ప్రేమతో పెంచక పోతే వాళ్ళు ఎదుగ గలరా. చదువు ఉద్యోగం ఇవన్నీ వచ్చే వరకు ప్రయోజకులు అయివరకు కుటుంబ సభ్యులు అంతా ప్రేమగా ఉండాలి ఉంటేనే నిజమైన జీవితము.
యశోదర్ చదువులో మేధావి అందుకే మెడిసిన్ సీటు మెరిట్ లో వచ్చింది అందుకే చదివేశాడు, కానీ అతనికి పొలము అన్నా పల్లె అన్నా ఎంతో ఇష్టము.
వృత్తి రీత్యా డాక్టర్ అయిన సరే ప్రవృత్తి వ్యవసాయమే. మనం ఆలోచిస్తే నిజానికి పొలం నుంచే పంట మనిషికి కావాల్సిన ఆహారము మనకు భూమాత వల్లే కదా అందుకే భూమి అంటే ప్రేమ అభిమానం ఆదరణ ఉంటే గాని మంచి ఆహారం ఉండదు.
యశోదర్ పూర్వీకులు జమీందారులు ఆయుర్వేదం వేదం పొలాలు నమ్మి అతిథి అభ్యాగతి అనే గౌరవ మర్యాదలతో బ్రతుకుతూ వచ్చారు ఇప్పటికీ అదే పద్దతి. కావాల్సిన వారిపై ప్రేమ అభిమానం చూపాలి.
మనవడి పెళ్లి చూడాలని పెద్దలు అంతా ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎవరినీ చేసుకున్న ఇష్టమే అన్నారు. ఎంతో మంది డాక్టర్ చదివిన పిల్లల్ని చెప్పారు. కానీ మా పిల్లాడు సిటీకి కి వెళ్లి ఉండడు. విదేశాలకు వెళ్ళాడు కనుక మీ పిల్లకి ఇష్టం ఉంటే చెయ్యండి అన్నారు.
కొందరు ఎంత చదివిన పల్లె ప్రేమకి అంకితం అవడం వల్ల కొందరికి అసలు నచ్చదు కానీ జీవితంలో రకరకాల ప్రేమలు ఉంటాయి అవి పొందడం కొందరికే సాధ్యము. అందుకే పెళ్లి విషయం లో కొంచెం బాగా అలోచించారు అంతా కూడా.

*****

పూర్వం ఆడపిల్ల పెళ్లి కష్టం అయ్యేది కానీ నేడు మగపిల్లాడు పెళ్లి కష్టం అవుతుంది ఇంటి పట్టున పెద్దల్ని ప్రేమగా చూసే పిల్లలు దొరకడం లేదు
వంట వార్పు అవసరం లేదు.
పనివాళ్ళు ఉన్నారు పెద్ద వారిని ఆప్యాయతగా ఆదరణగా చూసే ఆడపిల్లలు దొరకడం లేదు మా పిల్ల ఎమ్ సి ఎ చదివింది, మా పిల్ల ఇంజినీర్ చదివింది, మా పిల్లల సి ఏ చదివింది అని చెప్పేవాళ్లు గాని, పిల్ల జీవితంలో సుఖ పడుతుందని ఎవరూ ముందుకు వచ్చి పెళ్లి జరుగ నివ్వడం లేదు అని పెద్ద వాళ్ళు బాధ పడ్డారు. కానీ విధి గొప్పది ఎవరి ఆలోచనలు కుదరవు ఎలా మార్చుతుంది? వేచి చూద్దాం అన్నారు.
ప్రేమ అనేది ఒక అపురూప సంపద అది అందరికీ ఉండదు ఇపుడు తల్లి తండ్రులు డబ్బు సంపాదించే యంత్రాలు ఆప్యాయత ఆదరణ అభిమానము ఆనందము అన్ని కూడా మన సన్ని హితులు వల్లే వస్తాయి. ఈనాడు అవి ఎక్కడ లేవు.
సెర్చ్ లైట్ వేసి చూసినా కాన రావు అనుందుకే ఆ ఇంట్లో రెండు తరాల మనుష్యుల్ని ఆదరణ గా చూసే పిల్ల కావాలి అందుకు వెదుకుతున్నారు. కళ్యాణం వచ్చిన కక్కు వచ్చినా ఆగదు అంటూ జ్యోతిష్కుడు చెప్పారు మనుమడు పెళ్లి కోసం పెద్దలు అంతా ఎదురు చూపులో ఉన్నారు.
వేద శ్రీ తెల్లగా పొడుగ్గా నాజూకుగా ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్నని ప్రేమగా చూస్తోంది. అన్నగారు దుబాయ్ లో ఉన్నాడు తల్లి తండ్రి బాధ్యత చూస్తూ ఉన్నది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లో బిజీ. ఇంజినీర్ చదివిన అమ్మాయి ఇంటి పట్టున ఉండి తల్లినీ తండ్రిని చూస్తూ హాయిగా ఉన్నది ఈ రోజుల్లో చదువుకున్న పిల్లలు ఇంత కుదురుగా ఉంటారా ?
పెద్దల్ని పట్టించు కుంటారు అనుకోవడం గగన కుసుమం అని చెప్పాలి. అయితే వేద మాత్రం ఉన్న డబ్బు చాలు నాకు నా తల్లి తండ్రి ముఖ్యము నేను వాళ్ళనీ చూడటం తరువాతే ఉద్యోగము అని చెప్పింది
ఇది విన్న పెళ్లిళ్ల పేరయ్య కాస్తా మహా ఆనంద పడి ఈ అమ్మాయి మన యశోధర్ కి సరిపోతుంది. ఒక ప్రక్క తల్లి తండ్రి మరో ప్రక్క అత్తింటి వారిని చూస్తుంది అని ఆశా పడి వెళ్లి చెప్పాడు.
ఈ రోజుల్లో ఆడ పిల్లలు కూడా కుటుంబ భాధ్యతలు చూస్తున్నారు అనుందుకు సంతోషించాలి అని అందరూ అనుకున్నారు.
ఆడ పిల్లలు పూర్వం లా కాదు కుటుంబ పోషణలో భాగం పంచుకుంటున్నారు కానీ వేద తల్లి తండ్రికి అస్తి ఉన్నది కొడుకు విదేశాల నుంచి డబ్బు పంపుతాడు, అందుకు ఆమెకు ఉద్యోగం చెయ్యాలనే ఆలోచన లేదు ఉన్న దానితో సరిపెట్టుకుంది. మనం మన ఆత్మీయులను బంధువులను చెంద నాడుకుని దేశాలు పట్టుకు వెడితే ఉపయోగం ఏమి ఉన్నది?
ఇదే ప్రశ్న అమె అంటే అంతా వింతగా చూస్తారు, లేదా వాళ్ళకి తరగని డబ్బు ఉన్నది టాక్లు కట్టాలని అల చెపుతోంది అంటారు. అంతే గాని నిజంగా ప్రేమ ఆప్యాయత ఎవరికి ఉంటుంది అందులో ఈ తరం ఆడపిల్ల డబ్బు యావ ఉంటుంది కానీ పెద్ద వాళ్ళని ఎందుకు చూస్తుంది అని కొందరు ప్రశ్న కానీ పెళ్లిళ్ల పేరయ్య మాత్రం నిజమే అని వప్పుకున్నాడు.
పెళ్లి వారికి అటూ ఇటూ కూడా సారధ్యం వహించాడు. పెళ్లిళ్ల పేరయ్య చెప్పిన మాటలు అటు ఇటు నచ్చాయి. పిల్ల బుద్ది మంతురాలు పిజి చేసింది సంప్రదాయ కుటుంబం వంట వార్పు వచ్చును అయిన మనింట్లో వంట మనిషి ఉన్నది.
కారణం బామ్మ తాతకి మెత్తని పస్తెం వంట అమ్మ నాన్నకి మంచి పోపులతో రుచికరమైన వంట ఇలా రెండు రకాలు చెయ్యాలి వంట మనిషి రాకపోతే అమ్మ వాళ్ళు కూడా తాత బామ్మ వంటకాలు తింటారు. ఇంట్లో జ్ఞానం వచ్చిన పిల్ల ఉంటే ఈ బాధ ఉండదు కానీ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయి వెళ్లిపోయారు. కోడలు రావాలి ఆమెకు ఇవన్నీ ఇష్టం ఉండాలి. పెళ్లి వల్ల రెండు కుటుంబాలకు వారధి అని చెప్పాలి కోడలు కానీ అల్లుడు గాని దీనికి సారథులు ఒకరి నొకరు గౌరవించుకోవాలి ఎక్కడి నుంచి వచ్చిందో కదా ఇక్కడ పరిస్తితులకు పద్ధతులకు అలవాటు పడాలి. పిల్ల మనింటికి వస్తుంది కనుక ఇల్లు వాకిలి ఆమెకి సుఖంగా ఉండేలా ఎర్పాటు చెయ్యాలి.
పూర్వకాలం ముసలమ్మ ఉన్నారు కాదని వాళ్ళ పద్దతిలో మా కాలంలో అలా ఉన్నాము ఇలా ఉన్నాము అంటూ ఇరవై నాలుగు గంటలు పెద్ద వాళ్ళ మాటలు పద్దతులు ఆచరించ మని విసిగించ కూడదు.
అసలు ఇప్పుడు పెళ్లికి ముందే అత్తగారు ఆడ పడుచులు రక రకాల ఆంక్షలు పెట్టీ కొత్త పిల్లని పెళ్లి కాకుండానే భయ పెడుతున్నారు.
రెండు మనసులు కలవాలంటే
ఆర్థిక బంధం అడ్డు వస్తోంది.
ఆత్మీయ బంధానికి విలువ లేదు
ప్రేమ అభిమానం ఆదరణ ఉంటే గాని
ఆనందం ఉండదు
పెళ్లి చేసి పంపిన దగ్గర నుంచి
ఏమి ఫోన్ వస్తుందని భయం ఉంటుంది
పెళ్లి అయి పిల్లను ఆదరించడం
భాద్యతగా చూడటం లేదు కానీ
మా కొడుక్కి ఆషాఢ పట్టి
బ్రాస్లెట్ గొలుసు ఉంగరం పెళ్ళిలో పెట్టలేదు వెండికంచం చెంబు వద్దంటే మాత్రం ఇవ్వ వద్ద అంటూ ఏడాది తరువాత అల్లరి గొడవ చేసే పెద్దలున్నారు. పెళ్లి వీళ్లంతా ఎవరూ ఉండరు. పెళ్లి తరువాత వాళ్ళ బంధువుల మెప్పు కావాలి కోడలు అంటే ఇంట్లో కొంగు దోపుకుని వంటింటి గడప దాట కూడదు అని ఎదురు కోడలికి చెపుతారు. అదే సొంత కోడలు అయితే వంట వండక పోయినా కేటరింగ్ తెప్పించి తింటారు. వాళ్ళకి లేని సుఖము ఎదురు ఇంటిలో ఉండకూడదు. అంత వరకు లేని మామయ్యలు, బాబయ్యలు, అత్తలు, పెద్దమ్మలు, పెద్దమ్మ, కూతుళ్ళు వచ్చి గొడవలు పెట్టీ నీ పెళ్ళాం అలా ఉందిరా ఇలా ఉందిరా నిన్ను లోకువ కడుతుంది అంటూ సరాగాలు చూపి గారాలు చేసి కొత్త కోడలు పై చాడీలు చెప్పి పుట్టింటికి పంపి అన్ని నేర్చుకుని రా అని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మరీ పంపుతారు. ఇటువంటి కుటుంబాల వారు కొడుక్కి పెళ్లి చెయ్యి కూడదు కొడుకు సొమ్ము తింటూ బ్రతక డానికి కొత్త కోడలు అడ్డు గోడ.. అందుకే మా అబ్బాయికి పెళ్లి అయింది కాని కోడలు పద్దతి కుదరక నచ్ఛక మమ్మల్ని ఇబ్బంది పడ వద్దని కోడల్ని పుట్టింటికి పంపాము అంటూ అతి గొప్పలు చెప్పే అత్తలు ఆడబడుచులు ఉన్నారు.
అయ్యి తమ్ముడిని అత్తవారింటికి పండగకి పంపాలి అని అనుకోరు మాకు పండుగలు వద్దు మీ పిల్లని మీరు సెట్టు కొనండి అని చెప్పే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆడపిల్లల తల్లి తండ్రులు ఎంతో ఆలోచించి పెళ్లి చేస్తున్నారు. వాళ్ళ తిన్న వాళ్ళు వచ్చి అడుగుతున్న అందులో ఏదో లోపం ఉన్నది అని భయ పడుతున్నారు.
యశోదర్ పెళ్లి విషయంలో అలాగే భయపడ్డారు. నలుగులు పెద్ద వాళ్ళని చూసుకుంటూ కట్టుకున్న పెళ్ళాన్ని సరిగ్గా చూడని ఎన్నో కుటుంబాలు చూస్తున్నారు పెళ్లి కాని ఆడపిల్ల ఉంటే ఇంకా ఘోరంగా ఆంక్షలు పెడుతూ మా పిల్లలను అలా పెంచాను, మీ అమ్మ ఇలా పెంచింది ఏమిటి ? అంటూ అక్కర లేని వంకలు పెడుతూ మనస్సు గాయ పరుచే పెద్దలు ఉన్నారు. అంతే కాదు కొడుకుకి కూడా చాడీలు చెప్పి కోడల్ని అప్రయోజకురాలిగా చూపే అత్తలు ఉన్నారు. బయటి వాళ్ళకి సూక్తులు గొప్పలు చెపుతూ కోడల్ని విమర్శిస్తూ పక్కింటి ఎదురింటి వార్కి అడుగు మడుగు లోత్తు తు అబ్బే ఏమీ పెంపకం అని ప్రతి రోజూ మనసు గాయ పరుస్తారు అందుకే పెద్దల మాటలు వినే పిల్లలు అంటే ముసలి వాళ్ళు ఉన్న ఇంట్లో పెళ్ళిళ్ళు కష్టంగా ఉంటున్నాయి అని పెళ్లిళ్ల పేరయ్య పెద్ద పురాణం విప్పాడు.
సరే పిల్ల వప్పుకుంటే అమె తల్లి తండ్రినీ చూస్తూ మమ్మల్ని చూడవచ్చును అంటూ పెళ్లి కి వప్పిం చి పెళ్లి చేశారు. వేద మంత్రాల మద్యలో పెద్దల ఆశీస్సులుతో డాక్టర్ యశోదర్ వేద ఒకటి అయ్యారు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సన్నాయిలో శ్రావ్యంగా ఆలపిస్తారు
ముత్యాలు రంగుపూసలు తళుకులు బియ్యం తలంబ్రాలు, రక రకాల పువ్వులా తలంబ్రాలు ఆనందంగా పోసుకుని కర్పూరం సువాసనల దండలు పువ్వులా దండలు మార్చుకుని ఒకటి అయ్యారు. అయితే వచ్చిన బంధువులు రకరకాల వింత విచిత్ర ధోరణిలో మాటలు సాగాయి.
ఆత్మీయ బంధాలు పెంచ డానికి పెద్దలు సహకరించాలి రేపటి తరానికి మంచి మానవత పెంచాలి. అందుకు పెద్దలు కబుర్లు కాక పిల్లలని జాగ్రత్తగా పెంచాలి. మనింటికి వచ్చిన పిల్లలని ప్రేమగా చూసి రేపటి రోజు వారిది అని అవకాశం ఇచ్చి వారి ఆలోచనలకు విలువ నిచ్చి పెద్దలు గౌరవం పెంచుకోవాలి. అప్పుడే బంధాలు అనుబంధాలు బలపడతాయి నూతన తోరణాలు కట్టి కొత్త తరానికి స్వాగతం పలకాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!