కనువిందు
రచన: కాకు మాధవిలత
పచ్చ పచ్చని పంట చేలు
జల జల పారు జలపాతాలు
కనువిందు కనువిందు కనువిందు
రంగు రంగుల హరివిల్లు
రంగు రంగుల పూలు
కనువిందు కనువిందు కనువిందు
ఆకాశాన పరుగులు తీయు మబ్బులు
రెప రెప ఊగుతూ పంటచేను
కనువిందు కనువిందు కనువిందు
చెంగున పరుగెత్తు లేళ్ళు
చెంగున ఎగిరే పిల్లలు
కనువిందు కనువిందు కనువిందు
ఉరకలు వేస్తూ పారు నదులు
ఉరకలు వేసే పరువాలు
కనువిందు కనువిందు కనువిందు