అక్షరాస్యత ఆర్ధికప్రగతి

అక్షరాస్యత ఆర్ధికప్రగతి

రచన: వి. కృష్ణవేణి

దేశఅభివృద్ధి అక్షరాస్యత వల్లే సాధ్యపడును.
ప్రతీ ఒక్కరూ ముందుగా అక్షరాస్యతను సాధించి
అభివృద్ధి మార్గాల వైపు పయనిస్తూ..
సామాజిక, ఆర్ధిక, నైతికతను
మెరుగుపర్చుకుంటూ..
ఉన్నతమైన జీవనాన్ని కొనసాగిస్తూ..
దేశవిదేశాల పురోగతిని తెలుసుకుంటూ

మనదేశ ఆర్థికతను అభివృద్ధి చేసుకుంటూ..
నిత్య ఆధునికవిద్యను ఆర్జిస్తూ
జాతిపురోగతిని సాధిస్తూ ఉండాలి..
దేశపురోగతిని, ఆర్ధికాభివృద్దిని సాధించాలంటే
ముందుగా అక్షరాస్యతను సాధించాలి.
సాంకేతిక విద్యను
వృత్తిపరవిద్యను
సామాజిక విద్యను అందరికి అందేలా కృషి చేస్తూ..
సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన రోజున
దేశఅభివృద్ధి మెరుగుపడును.
సంక్షేమపథకాలను సమవిధంగా

అందరికి అందుజేయాలంటే, వాటిగురించి తెలుసుకుని
పొందాలంటే..
ప్రభుత్వపథకాలను తెలుసుకుని
వాటిని పొందడానికి కనీసం ప్రాథమిక విద్యను అయిన అభ్యసించాలి..
దానికోసం అందరూ కృషి చేయాలి..
అప్పుడే దేశఆర్థిక అభివృద్ధి సాధించగలం..
దేశఆర్ధిక ప్రగతిని పొంది ఉన్నతిని చవి చూడగలం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!