సిసి కెమేరా

సిసి కెమేరా

రచన: మంగు కృష్ణకుమారి

ఓసీ సీ.సీ , చాపకింద నీరులా ఎలా వచ్చేవో! అభద్రత బతుకుల వాళ్లం! మమ్మల్ని మేమే వంచించుకొనే వాళ్లం!

దొంగలని పట్టిస్తావని, నిశ్చింతగా ఉండొచ్చని నిన్ను ఎత్తు సింహాసనం మీద కూచో పెడితే ఏం చేస్తున్నావు? ఎటు చూస్తున్నావు? మమ్మల్నే ఠారెత్తించిస్తున్నావు! పెద్ద పులి, కాల నాగులు వస్తాయన్న భయం కన్నా నువ్వున్నావన్నా భయం మిన్న !

కనపడని ఆ దేముడు జీవులందరూ సమానం అంటాడు! కనపడని నువ్వు కనబడ్డదంతా కావాలంటావు! దొంగలో, దొరలో, పారాడే పాపలో, పరువాల కొమ్మలో, అయిదుగురు పిల్లల అమ్మలో మూలనున్న ముసలమ్మలో, నీ ముందుంటే అందరూ సమానమే!

సూది కోసం సోదికెళితే, పాత తప్పులన్నీ విప్పి విప్పి చెప్పిందట సోదమ్మ ! దొంగలని పట్టివ్వవే, అంటే, మా దొంగ బుద్ధులన్నీ లాగి , ‌లాగి చూపిస్తున్నావు నువ్వు!

తుంటరి మన్మధుడి ఆట కట్టించిందికే నిటాలాక్షుడు మూడో కన్ను తెరిచేడట సృష్టి కర్త ఆ విశ్వ బ్రహ్మ కాకుండా ఈ మానవ బ్రహ్మ అవడం‌ అన్నీ మా గుణాలే!

“నా బంగారం కన్నం లో వేలు పెడితే కుట్టనా?” అందిట చీమ అంత పసివాడితో! “నా బంగారం కన్నుని
వేలితో తెరిస్తే ఎదురుగా ఉన్నవన్నీ తియ్యనా ” అంటున్నావు నువ్వు అందరితో !

You May Also Like

One thought on “సిసి కెమేరా

  1. సిసీ కెమెరా గురించి చాలా బాగా చెప్పారమ్మా! నా బంగారు కన్నులో వేలు పెడితే అంటూ. భలే వ్రాసారు👌👌👌🤣🤣🤣

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!