రస గంగాధర

రస గంగాధర”

రచన:: డి.స్రవంతి

భావకవి ప్రణామాలు అయ్యా నీకు
రస గంగాధర తిలకం బాలగంగాధర్ తిలక్
ప్రగతిశీలుడైన మానవతావాది

నీవు కవివే కాదు కథకుడివి, నాటకకర్తవి
నీవు కవితకరామతల్లి ముద్దుబిడ్డవి,
నిత్య యవ్వనుడివి
నీ కవిత కరవాలం అంత పదునైనది
నీ కవితా అమృతానికి జీవనవాస్తవిక హాలాహలాన్ని జోడించావు
నీ కవితా సేద్యం కడు రమ్యం కమనీయం
నీదు త్రిమూర్తులు కవితలో అక్షర బాణాలు
సంధించి ప్రత్యేక కవిగా నిరూపించావు
నీదు కవిత యందు మానవ జీవన వాస్తవిక దృష్టిని చూపించావు
కథల్లో సామాజిక సమస్యల్లో చిక్కుకున్న మానవత్వపు భిన్నకొనాలు రూపుకట్టించావు.
నీదు కలం నుండి జాలువారిన…” అమృతం కురిసిన రాత్రి” కథాసంపుటితో ఉన్నత శిఖరాలను అధిరోహించిన అభ్యుదయ, భావ కవితామూర్తి..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!