నేనెట్టా వేగేది…?

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

నేనెట్టా వేగేది…?

రచయిత :: నాగ మయూరి


అబ్బ బబ్బ బబ్బా నా అగచాట్లను ఎలా వర్ణించను?

ప్రతిదానికి పంచాంగం చూసే పతితో నా పాట్లు ఏమని చెప్పను!

నుంచుంటే – నియమాలు, నిష్టలు అంటాడు

కూర్చోవాలంటే – కుజుడు రావాలంటాడు

ఇల్లు దులుపుదామంటే – దుర్మహూర్తముంది వద్దంటాడు

వాకిలి అలికి మగ్గులు పెడదామంటే – వర్జ్యం వెళ్ళేదాకా ఆగి వేళకాని వేళ ముగ్గెయ్యమంటాడు

రంజుగ రామచిలకల్లే ముస్తాబయితే… రాహుకాలము వెళ్ళాలి ఆగమంటాడు

ఏటికోమారు సరదాగా సినిమాహలు కెళితే… యమగండం అంటూ లోనికెళ్ళి, సినిమా చూడనివ్వడు

అందంగా పిండి వంటలతో భోజనం సిద్ధం చేసి ఆవురావురంటూ తినబోతుంటే …. అమృత గడియలు రాలేదు ఆగమంటాడు

నవరత్నాల లాంటి పిల్లలకేమో.. .. నవగ్రహల పేర్లు పెట్టాడు

గుమ్మం దాటి గుడికి వెళ్లాలంటే గురుడు అనుకూలించాలి అంటాడు

పుట్టింటికి పయనమయితే పిల్లి ఎదురొచ్చింది… దుశ్శకునమంటూ ప్రయాణం ఆపేశాడు

ఇల్లు దాటి బయటకు వెళ్ళనివ్వడు….
ఇంట్లో కుదురుగా ఉండనివ్వడు….

ఇంక నేనెట్టా వేగేది ఈ ఛాదస్తపు మొగుడు తో

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!