జీవితం

జీవితం

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

సుమధుర జ్ఞాపకాల సమాహారం ఈ జీవితం…
అనుభవాల అనూహ్య ఘటనల అమరిక…
సుఖ దుఃఖాల ఆటు పోటుల కలయిక….
మంచి చెడుల ఒరవడి నూరేళ్ళ జీవితం…
లిప్తపాటు జీవనానికి జీవన్మరణ పోరాటం…
పడి లేచే కెరటం ప్రతి మనషి మధనం…
ఆగి పొమ్మంటుంది ప్రాణం…
కదిలి పొమ్మంటుంది కాలం…
మధ్య నలిగే వ్యర్ధ జీవిత ప్రయాణం…
తప్పించు కునేందుకు తిప్పలు పడుతున్నా వదలని బంధాలు…
ఎంత కష్ట పడినా ఎదగని పేద బ్రతుకులు…
వెలుగు లేని ఆశా బ్రతుకుల వన్నెలలు….
అవధులు లేని ఆనందాల ప్రతిక..
కనిపించే ప్రతి మనిషి లోను మెదిలే వెతలు
వంచనతో ముడిపడి ఉన్న మూగ బతుకులు…
అనుబంధాల సంకెళ్ళ జీవన ప్రయాణం…
మారునా ఈ తరుణం ?

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!