నీకై వేచి చూస్తూ

నీకై వేచి చూస్తూ

రచన: విజయ మలవతు

నీ చూపులదాటికి తట్టుకునే మనసుని
చుక్కల లోకానికి తరలించి
కన్నీటి దారలనే మేఘాలకు అరువిచ్చి
నీకై వేచి చూసే కనులనే నెమళ్లకు అందించి

మల్లెల వాసననే తెలుసుకోలేనంత అమాయకంగా నాసికా పుటాలే తీర్చి
ఇష్ట రాగమైన నీ పేరునే మరపుగా కానుకిచ్చి
నా పెదవులనే తమకంతో మిగిలేలా

అడుగులో అడుగే కలిపే
పాదముద్రలే నీకై సాగే
దారిని చెరిపి నీలి మేఘమునే ఎక్కి
అలసట తీరుస్తూ

ఎంతలా సముదాయించినా
కలలు ఆపమని
బ్రతిమలాడినా వినని మొండి వైఖరితో
అందరాని తీరాలలో దాగి
వేధించటం న్యాయమా ప్రియతమా..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!