ఇంటి దేవుళ్ళు

ఇంటి దేవుళ్ళు

రచన: చెరుకు శైలజ

వృద్ధులు మన ఇంటి దేవుళ్ళు
అనుభావాల గనులు
ఏ కల్మషం లేని పసిపిల్లలు.
మనకు మార్గం చూపే మంచి మనుషులు.
వారి మమతలను వెల కట్టలేము
ఎన్నో కష్టాలను ఎదుర్కొని

కన్న పిల్లల కోసం తమ ఇష్టాలను వదులుకున్న త్యాగమూర్తులు
మర్మం తెలియని పెద్దలు
పెద్దరికానికి విలువ నిస్తు
వారిని కంటి కి రెప్ప లా కాపాడుకుంటు
చంటి పాపలగా లాలిస్తూ
సేవలతో పూజిస్తూ
వాళ్ళ జీవితాన్ని సంతోషం సాగరంలో ముంచడమే వారి పిల్లల బాధ్యత

నేటి బాలలే రేపటి యువత
నేటి యువతనే రేపటి వృద్ధులు
అనే విషయం మరిచిపోవద్దు
వారిని చులకన చేయవద్దు
వారికి చేయూతనిస్తూ
చివరిదశలో ఉన్న వారిని ఆదరించ వలసిన అవసరం ఎంతైనా వారి పిల్లలకు ఉంది.
అందుకే వృద్ధులను ప్రేమిద్దాం
వారికి ఆసరాగా ఉందాం
చివరిదిశలో వారికి ఆప్యాయతను పంచుదాం.
వారి ఆనందానికి పాత్రులమవుదాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!