ఇగో

 ఇగో

రచన::శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి

తలుపు కొడుతున్న శబ్దం వినిపించి వెళ్ళి తలుపు తీశాడు కమల్. ఎదురుగా ఎవరో ఒక స్త్రీ నిలబడి ఉంది ఎవరు…. ఎవరు కావాలి అని అడిగాడు కమల్ .
అవతలి వైపున ఉన్న స్త్రీ ఏమీ మాట్లాడకపోయేసరికి వెనక్కు వచ్చి టీపాయ్ మీదనున్న కళ్ళజోడు పెట్టుకుని మరలా తలుపు దగ్గరికి వచ్చాడు కమల్ .
ఎదురుగా ఉన్న స్త్రీ చేతితో ఏదో పట్టుకొని ఉంది
కొంచెం మసక గా కనిపించి ఆ వచ్చిన మనిషి ఎవరో అర్థం కాక పెట్టుకున్న కళ్ళజోడు సరిగ్గా సవరించుకుని మరలా చూసాడు ఎవరూ అంటూ
అంతే స్థాణువై ఉండి పోయి నువ్వు.. నువ్వు ..అంటూ నోటి మాట రాక అలాగే నిలబడిపోయాడు
ఆ వచ్చిన స్త్రీ తన చేతిలో ఉన్న శుభలేఖలలో ఒకటి తీసి అతని చేతిలో పెడుతూ ఈనెల 15వ తారీఖున మా అబ్బాయి పెళ్లి అని చెప్పి అక్కడ నుండి వెనక్కి తిరిగి గిర్రున వెళ్ళిపోయింది
వెంటనే తేరుకున్న కమల్ సుజాత… సుజాత ఆగు అంటూ అన్నాడు కానీ ఆ మాటలు అతని గొంతు దాటి బయటకు రాలేదు

కమల్ కి మంచి ఉద్యోగం ,అందమైన భార్య, ముత్యాల్లాంటి ఇద్దరు మగ పిల్లలు ముచ్చటగా సాగుతున్న సంసారం అన్ని బాగానే ఉన్నాయి కానీ కమల్ కి ఇగో చాలా ఎక్కువ తెలియని విషయం కూడా తనకు తెలిసని అంటాడు.
ఏ విషయమైనా తెలియదని అస్సలు ఒప్పుకోడు సరికదా అది తప్పు అని ఎవరైనా చెబితే వారి మీద అరుస్తాడు అది ఇంట్లో భార్య అయితే మరీ లోకువ కదా భార్య మీద పిచ్చెక్కిన వాడిలా రంకెలు వేస్తాడు

కమల్ భార్య సుజాత భర్త మనసెరిగి నడుచుకుంటుంది .పెళ్ళైన మొదట్లో అయితే భర్తకి అర్థమయ్యేలా చెప్పాలి అని చూసేది కానీ భర్త అర్థం చేసుకోక పోగా ఇల్లు పీకి పందిరి వేస్తూ ఉండడంతో ఇంటిని వీధిలో పెట్టుకోవడం ఇష్టం లేక తన ఆవేదనను గొంతులోనే దాచుకుని పుట్టిన పిల్లల మొహం చూస్తూ ఏదోలా నెట్టుకొస్తుంది కాపురాన్ని

అలాంటిది ఒక రోజు ఇలాంటి విషయంలోనే గొడవ జరిగింది సుజాత కి కమల్ కి ఎప్పుడు గొడవ జరిగినా అందులో విషయం ఏమిటంటే చెప్పడానికి కారణం ఏమీ ఉండదు .ఆ రోజు జరిగిన గొడవలో కూడా చెప్పడానికి విషయం ఏమీ లేదు. పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అవుతున్నారు.
ఒక బాబు సాత్విక్ 7వ తరగతి ,రెండవ బాబు కృతిక్ 5వ తరగతి చదువుతున్నారు.

సుజాత ఎంత సర్దుకు పోదామన్న ఇగో తో గొడవలు పెద్ద చేసేసాడు కమల్ ఇంక తట్టుకోలేక సుజాత పిల్లలని తీసుకుని నా చావు నేను చస్తాను మీతో వేగే ఓపిక సహనం నాకు చచ్చిపోయాయి నేను కూడా చస్తే వదిలిపోతుంది. అని ఏడుస్తూ పిల్లలిద్దర్ని తీసుకుని వెళ్ళి పోతుంటే కమల్ వారేని ఆపనైనా ఆపకుండా చస్తే చావండి పీడ విరగడైపోతుంది అని తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు

ఆ తర్వాత వారు ఏమయ్యారని కనీసం ఆరా కూడా తీయలేదు వాళ్ళే వస్తారు రాక ఎక్కడికిపోతారు ఇంకెక్కడికి వెళ్తుంది పుట్టింటికే వెళ్ళి ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు దిక్కులేక నా కాళ్ళ దగ్గరకు తనే వస్తుంది. నేను ఇప్పుడు తనను వెతుక్కుంటూ వెళ్తే అందరి దృష్టిలో చులకన అయిపోనా అని ఆలోచించుకుంటూ ఉండిపోయాడు కమల్.

ఇది జరిగిన వారం రోజులకు పేపర్లో ఒక వార్త వచ్చింది ఒక ఆడ మనిషి ఇద్దరు మగ పిల్లలు గోదావరిలో దూకి చనిపోయారు శవాలు గుర్తుపట్టలేని విధంగా అయిపోయాయి అని అది చూసిన కమల్ సుజాత వాళ్ళ పుట్టింటికి వెళ్తే వాళ్లు ఇంకెక్కడి శవాలు ఎప్పుడో ఖననం చేసేశాం మా బిడ్డను మాకు దూరం చేసేసావు కదా ఇప్పటివరకు విషయం మాకు చెప్పకుండా దాచి పెట్టేసావు ముందుగా తెలిసినా మేము వాళ్ళని కాపాడుకునేవాళ్ళం అని తిట్టి పోస్తుంటే ఇంక అక్కడ ఉండలేక ఇంటికి తిరిగి వచ్చేసాడు తను.

ఆ వచ్చింది సుజాతే, కానీ ఎలా సాధ్యం ఎప్పుడో చనిపోయిన సుజాత ఇప్పుడు ఎలా వచ్చింది అర్థమవలేదు తనకి వెంటనే ఆ స్త్రీ ఇచ్చిన శుభలేఖ తెరచి చూసేసరికి ఆ వచ్చిన స్త్రీ తన బార్య సుజాతేనని రూఢీ అయిపోయింది.ఎందుచేతనంటే అందులో పెళ్లికొడుకు పేరు సాత్విక్  తండ్రి స్థానంలో తన పేరు తల్లి సుజాత
తమ్ముడు కృతిక్ అని ఉంది.

వెంటనే అందులో ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేశాడు కమల్
ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరండీ అన్న అవతలి నుండి ఒక స్త్రీ స్వరం
నేను సుజాత అన్నాడు తను
చెప్పండి అన్నది భర్త స్వరం గుర్తుపట్టిన సుజాత

దానికి కమల్ మీరు…… మీరు??? అసలు ఏం జరిగింది
ఆ రోజు ఆ పేపర్లో ఆవార్త ఏంటి అన్నాడు
దానికి ఆ రోజు పేపర్ లో వచ్చిన వార్త నిజమే కానీ అది మేము కాదు
ఆరోజుమేము ఇంటి నుండి వెళ్లిపోయాక మా గురించి వెతికే ప్రయత్నం కానీ కనీసం మా పుట్టింటి వాళ్లకి మేము వచ్చామా అని ఫోన్ గాని చేయలేకపోయారు మీరు అప్పుడు అర్థమైంది నాకు మీలో ఇగో ఎంతగా నాటుకుపోయిందో అందుకే ఆ రోజు ఆ వార్తను ఆసరాగా చేసుకుని నేను మా పుట్టింటి వాళ్ళు కలిసి మీ దగ్గర నాటకం ఆడాము,

ఇగో తో నిండిపోయిన మీకు శిక్ష పడాలి కానీ ఏ తప్పు చేయని నేను, ఏ పాపం ఎరుగని నా పిల్లలు ఎందుకు చనిపోవాలి
ఆ శిక్ష మాకెందుకు అందుకే గుండె నిబ్బరం చేసుకొని నా కాళ్ళమీద నేను నిలబడి నా పిల్లల్ని చదివించుకుని ప్రయోజకుల్ని చేశాను పిరికిదానిలా చనిపోకుండా ధైర్యంగా నిలబడి బ్రతికి చూపించాను.

నేను నమ్ముకున్న నా ధైర్యం నాకు మంచి బ్రతుకును ఇచ్చింది. మీరు నమ్మకున్న ఇగో మిమ్మల్ని జీవితాంతం ఒంటరి వాడ్ని చేసింది జీవితంలో ఏది సాధించకుండా చేసింది ఇంకా మీరు ఆ ఇగోతోనే ఉంటే పెళ్ళికి రానవసరం లేదు. మీ ఇగోని విడిచిపెట్టి వస్తే మీకు స్వాగతం పలుకడానికి మేము ఎప్సుడూ సిద్ధమే
ఏదో మీరే ఎంచుకోండి ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది సుజాత.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!