ఇంటింటిపురాణం

ఇంటింటిపురాణం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : యాంబాకం.

      అది 1980 అనుకుంటా! మా వీది చాలా గొడవ గా సందడి గా ఉంది. ఏమిటా! అని అర్ధం కాక తలగోకుంటున్నా. అదిగో మంచినీళ్ళ బావి దగ్గర ఒక అమ్మాయి ఒక బింది నీళ్ళకోసం అని వచ్చి బావి లోపడిందంట ఆపక్కన మొగ్గం పోడుగు పట్టేవాళ్ళ భార్య చూసి భాగ్యం బావిలో దూకేసుందో…అని కేక పెట్టేసింది. అంతే వీధి, వీధి, వీధి బయటకు వచ్చేసింది. ఏమైంది మంగళి సరోజ, భాగ్యా మంచినీళ్ళ బావిలో దూకేసిందట, ఇంతలో ఐస్ అమ్మేవాడి భార్య ఆదెమ్మ ఏ ఎందుకంటా వదినా! అదేమే అంది చాకలి మంగ, అదే అంటే ఏమో మే మొన్న కూడ ఇంట్లో బాగ్య వాళ్ళ అమ్మ నిన్ను నీళ్ళకు పంపిస్తే గురవాతో ఏంది అంతసేపు మాట్లాడు తున్నావు. బిందినీళ్ళు తేవటానికి అంతసేపా? మీ నాయనకు తెలిస్తే చర్మం తీస్తాడు. ఇంట్లో చేతికి అందిన పిల్లను పెట్టకొని పనులు చేయించుకోంటాము అని అనుకుంటే నీకు ఊరు పెత్తనం ఎక్కువైయింది.
“ఆడపిల్ల బయట తలవుంచుకొని రావాలి ఆపిల్లతో ఎం మాటాలు అని తిడతా ఉన్నది. ఎదిగిన పిల్లలన్ని తిడితే ఎట్లా ఈ రోజుల్లో..! పాపం బాగ్య మంచిది. ఎవరు కనపడిన గల, గల, మాట్లాడతాది.” అది కాదే ఆపిల్ల చంగమామ కొడుకుతో తిరగతుందంట అవునా “ఛా” పాపం భాగ్య మంచి బిడ్డ, అలాంటి కాదు. సుబ్బారావు పెళ్ళాం కిష్ట వచ్చి ఎందే అందరూ గుసగుసలు ఆడుతున్నారు. అని వాళ్ళ మధ్యలో నిలిచింది.  ఏమే మంగ ఎమైంది బాగ్య! “మన మంచినీళ్ళ బావిలో పడిందంట, బయటకు తీశారా!”ఆ రామయ్య అదే పిచ్చయ్య కొడుకు తాడుకట్టి దిగున్నాడంటా పడి ఎంతసేపు అయింది. “ఇప్పుడే మా ఆయన వచ్చి సైకిల్ ఆడపెట్టి కాలు కడు కొని అన్నం కాడ కూర్చున్నాడు. దబ్బ్ మని సౌండు ఎందా అని ఆలోచిస్తూ ఉంటే బయట అరుపులు ఎవరాఅని చూస్తే నాంచారి అంతే బయటకు వచ్చాను”. ఇదో ఇంతలో వీళ్ళు వచ్చారు. ఇప్పుడు నీవు అంది.
“సరే లే ఆ బావిలో పడటం ఈరోజు ఏమైన కొత్తా! ఈ వీధిలో ఉండే ప్రతి ఇంట్లో వారు ఏవరో ఒకరూ పడి నోళ్ళే లలితమ్మ కోడలు వచ్చిన పదోరోజే జారీ బకెట్ ను అందుకో పోయి జారి పడింది. ఆపిల్ల పొట్టి అందుకే జారిపడింది. నిజమే! ఆపిల్లకి ఆయుస్సు ఉంది అక్క అందుకే బతికి బయట పడింది.” “నరసమ్మ పెద్ధకోడల్ని కొట్టి కొట్టి చావ బాదేవాడు కొడుకు, పాపం నోరుకూడ ఎత్తదు ఆమె, ఏమైందో చచ్చిపోయింది. ఆ బావిలోనే ఆ చావక ఏమి చేస్తుంది. వాడి బోధకాలు పైలేరియా ఎప్పుడూ జర్వం, పని బాటలే పైగా పెళ్లి చేశారు. ఇద్దరికి తిండి, బట్ట ఎట్లా వస్తుంది. పైగా ఆయనగారికి డబ్బు ఎలావస్తుందో తాగి, తాగి చస్తాడు. వచ్చి ఆమనిషిని కొడతాడంట అందుకే పొయిఉంటుంది. అదే మేలు బాగుపడింది.
ఒక్క సారితో బాధలు తీరిపోయాయి అంది మంగ. నీకు తెలుసా! వదిన ఎంది బత్తేమ్మ కూతురు యమున దానికంటే చిన్నవయస్సు వాన్ని చేసుకుందట, వాళ్ళు మామ కొడుకేనట అదా అది పెద్దకథలే వదినా, యమునాకి నెల తప్పిందంట వాడు వేరే కులమంటా అది పెద్దగొడవైంది. ఒకరి నొకరు నరుక్కునే అంత పని అయింది. అందుకని అన్న కాలు పట్టుకొని ఆస్తి యమునాకి రాసి ఇచ్చేసి పెళ్లి చేసిందంట. అంతేలే..! ఎమి కూర? ఎమి చేయలేదక్క నిన్న చిన్న చేపలు వస్తే మామిడి కాయ ఇంట్లో ఉంటే పులుసు పెట్టా! అదే ఈపూట సద్దేశా. అంతేలే రాత్రికి ఎమిచేయాలో!
తీసారా? బాగ్యన్ని లేదు ఇంకా ఇది ఎదో గొడవ. అమ్మో నీవు ఎక్కడ అనేవు! మన జయమ్మ కొడుకు రాము రోజు ఉదయాన్నే పేపరు వేస్తాడే వాడికి ఈ పల్లకి లవ్ అంట్నే కదా..! అదే బెడిసి కొట్టిందంటా! ఇంతో అరస్తా తొపులాట బాగ్య అన్న రౌడీ వెధవ తిరుగుబోతు అవునక్కా ఒకరోజు స్టేషన్ లో మూసేశారంట కదా! కాదుమే వాడు జట్క కుంటోడు, ఆ శంకరయ్య కొడుకు ఉల్ల నడుపోడు ఎవడు విజయ? ఆ ఆ ముగ్గురు తోడుదొంగలు ఆ..  మొన్న గోపాలయ్య ఇంట్లో దొంగతం చేసింది. వీళ్ళే నంట ఆ..!  ఇంతలో ఆ వీధి లోనే ఉండే చెంగల్ రాయుడు వచ్చాడు ఎంది తోపులాట అదే మామ నరసమ్మ బాగ్య బావిలో పడిందని అంది జయమ్మ. కొడుకే కారణం అని వాళ్ళ వాళ్ళు తగువంట మామ ఇంతలో పోలీస్ కు ఎలాతెలిసిందో వచ్చేసారు, ఇంకా గొడవ ఎక్కవ అయింది. ఒకరి మీద ఒకరు కేసులు, కంప్లైంట్ లు ఇలా ఉండగా బాగ్యాన్ని బయటకు లాగి గౌవర్నమెంటు హాస్పిటల్ కు తీసుకొని పోయారు. ఏమి కాలేదు భయపడింది.
మనిషి ప్రాణానికి ఏమి కాలేదు, చిన్న గాయం తగిలింది. అని తేలింది. ఇంతలో పోలీస్ వచ్చి ఎందుకు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోబోయావు? అని అడిగారు అక్కడ మళ్ళీ బాగ్య అన్న గొడవ పోలీసులు చోరవతో ఆగిందంట. “ఇంతకూ ఏమి లేదు సార్ నాకు నీరసంగా ఉంది అందులో డేటు అది వంగి చెందే బావి బోడిబావి అందులో పాచిపట్టి ఉంది ప్లాస్టిక్ చెప్పులు వేసుకొన్నిను, బకెట్ పైకి లాగి అందుకొనే టప్పుడు చెప్పులు జారి నాకు కూడా తెలియకుండా పడిపోయాను. ఇంతలో ఇన్ని పుకారులు వచ్చేశాయి”. ఇక్కడ అనుకుంటున్నది. వాళ్ళు చెబుతున్నది. “నాకు జరిగినది దేనికి పొంతనలేదు సార్”. అని బాగ్యా చెప్పితరువాత అందరినోళ్ళు మూతపడ్డాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!