రాలిన కాయ ఊరగాయ

రాలిన కాయ ఊరగాయ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు కంటే ముందు పోటీగా పూర్ణమ్మ  గబ గబ లేచి ఇంటిపనులు చేస్తుంది దేముడి పూజ గది వంట గది అవిడ తుడుస్తుంది తడి బట్ట పెడుతుంది. మిగిలిన ఇంటిపనులు సుబ్బాలు , పనిమనిషి చేస్తుంది పెరడు పనులు పాలేరు వెంకన్న చేస్తాడు. ఆ రోజు మనమడు రాహుల్ నీ ఒరే లేచి తోందరగా సంచిలు పుచ్చుకుని స్కూటర్ పై తోటకు వెళ్ళాలి ఆలస్యంగా వెడితే అన్ని రాలు గాయిలు పడేస్తాడు వాళ్ళు రాత్రి రెండు గంటలకే తోటకు వెడతాడు. అక్కడికి మన అవధానులు ముడుకి వెడతాడు. వాడి పెళ్ళాం ఊరగాయ కలిపి స్కూల్ కి వెళ్ళాలి అందుకని మొగుడు పెళ్ళాం ముందే రెడీగా కారాలు అవపిండి కొట్టించి ఉంచాను అన్నది నేను ఒక్క అవకాయ కారం కొట్టించా ఇంకా గుత్తి మెంతి కాయ కారం కొట్టించి లేదు రమణ రావాలి అధి అయితే మన దూరం బంధువు మడి కట్టుకుని వస్తుంది. ఏంటే బామ్మ సెలవలు అని నేను వచ్చాను సరిగ్గా నిద్ర కూడా పోనివ్వవు. ఉండరా మముమ డా ఒక్క వారం కష్ట పడితే ఏడాది పొడుగునా చక్కటి ఆవకాయ తిన వచ్చును కదరా ముందులే ముఖం కడుగు కాపీ కలిపాను ఇస్తాను. సరే తప్పు తుందా మానాన్న నీకు సహాయం కోసమే ఇక్కడకు పంపాను అని నీకు చెప్పాడు. నాకేమో అక్కడ హాయిగా  అన్ని రకాల పళ్ళు తినవచ్చు మన బంధువులు అంతా తెలుస్తూ ఉంటారు నాలుగు పెళ్ళిళ్ళు రెండు వడుగులు ఉన్నాయి. విదేశాలకు వెళ్లే లోగా బంధుత్వాలు పల్లె టూరు విలువలు తెలుసు కోవచ్చు అన్నాడు. మరి అందుకే కదరా తోటకు వెళ్ళి మామిడి కాయలు తెమ్మన్నాను
ఇంత చీకటి లోనా ఉదయం వేడ తానే బామ్మ అన్నాడు. అన్ని రాలుగాయలు మిగులుతాయి
వెళ్లకపోతే మీ నాన్నకి ఫోన్ చేస్తాను. వాడు నీ పళ్ళు రల గోడతాడు అన్నది. ఇదేమిటి పాలేరు ఉన్నాడు గా ఎవరూ ఉన్న సరే కూడా ఇంటి యజమాని ఉండాలి అప్పుడే మంచి కాయలు ఇస్తాడు తోట వాడు, మన తోటలో కాయలు పనికి రావా
అవి పళ్ళ కాయలు ఇవి ఊరగాయ కాయలు.
రాలిన పళ్ళు దేనికి పనికి రావు పచ్చడి అయి కింద పడతాయి నుజ్జు నుజ్జు పితపిత ముద్ద అవుతాయి.
పళ్ళు రాలి పడిన పదార్ధాలు ఎందుకు ? ఎంగిలివి పనికిరావు అంటూ నీతులు చెప్పింది. సూక్తి ముక్తావళి మొదలు అనుకున్నారు కోడళ్ళు.
బామ్మ కి ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఇద్దరు కూతుళ్లు అల్లుళ్ళు మన మలు ఇంట్లో రోజు పాతిక కంచాలు లేస్తాయి. అందరికీ బామ్మ వంట చేస్తుంది. కోడళ్ళు సహాయం చేస్తారు ఇది వేసవిలోనే  మామూలు రోజుల్లో తాతగారు బామ్మ ఉంటారు.
వాటికి వీటికి తేడా ఉన్నది. ఏమిటో ఈ సెలక్షన్ అన్ని పెద్ద వాళ్ళ ఇష్టమే. ఏడాది తినే ఊరగాయలు ఎన్ని రకాల సెలక్షన్స్ పెళ్లికి మాత్రం, ఓ రెండు గంటలు పెళ్లి చూపులు చూసి మా పెద్దలకి సరే పిల్లగౌడు వప్ఫ్ కోవాలి అంటారు. ఇంటికి వెళ్లి చెపుతాను అని అంటారు. అబ్బే అదేమీ లేదు పెద్ద వాళ్ళే కట్నాలు లాంఛనాలు మట్లుడుకుని నచ్చితే ఒక్ వాళ్ళకి నచ్చక పోతే అబ్బే పిల్లా డు ఏమి చెప్పడం లేదు. అంటే వాడికి నచ్చా లేదు అంటారు
రాహుల్ ఇలా ఆలోచిస్తూ రెడీ అయ్యాడు బామ్మ ఇచ్చిన కాఫీ తాగాడు. ఈ లోపు పాలేరు వెంకన్న రెండు సంచులు తీసుకుని అబ్బాయి గారు మీ వెనక నేను బండి మీద కూర్చుని వచ్చి కాయలు మంచివి ఎరుతాను. సైకిల్ అయితే ఆలస్యం అవుతుంది. వాడికి సూపర్ వైజర్ రాహుల్
మొత్తనికి మూడు న్నారకి ఇద్దరు కలిసి తోటకు వెళ్ళి వెయ్యి కాయలు ఏరి తెచ్చారు. అందులో ఆరువందల కాయలు చిన్న సైజ్  కాయలు గుత్తి మేంతికాయకి పెద్ద సైజ్ నాలుగు వందల కాయలు ఆవకాయకి తెచ్చారు. ఇంటి కి వచ్చే టప్పటికి అరు అయింది. ఊరే రాహుల్ మళ్లీ వెళ్లి పడుకోకు నేను నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేస్తున్నాను.
వేడిగా తిని వెళ్లి మీ తాత దగ్గర భగద్గీతలో విషయాలు తెలుసుకో అదే వ్యక్తిత్వ వికాసము ఎన్నో రకాల నేర్పుతుంది. అరున్నరకి బామ్మ స్నేహితులు ఇద్దరు పట్టు చీరలు మడి గట్టుకుని వచ్చి కాఫీ టిఫిన్ ఆరగించి బామ్మను పొగిడి చక్కగా కాయలు కూడా కడిగి బాగా తుడిచి ముక్కలు కొట్టారు అందులో జీడి పొర ఇంకొకమే వలిచి పెట్టింది. ఈలోగా బామ్మ వచ్చి కారం జాడి లోంచి కారం పెద్ద బేసిన్ లో వంచి నూనె కలిపి ముక్కలు కలిపి వేరే జాడీలో ఏత్హి నది ఇవి అన్ని పూర్తి అయ్యే టప్పటికి రెండు అయ్యింది. ఈ లోగా పెద్ద అత్త అమ్మ కలిసి మో మి డీ కాయ పప్పు వడియాలు చల్ల మిరప కాయలు గుమ్మడి కాయ పులుసు కొబ్బరి పచ్చడి చేసి వంట పూర్తి చేశారు. అందరికీ చక్కగా అరటి ఆకులు వేసి భోజనాలు వడ్డించారు.
వచ్చిన బామ్మలు ఇద్దరు జాగ్రత్త గా నమిలి తిన్నారు
వాళ్ళవి కట్టుడు పళ్ళు అని వడియాలు తినలేము అని మొందే చెప్పి వడియాలు పక్కన పెట్టారు.
భోజనాలు అయ్యాక చాపలు వేసుకుని కాస్సేపు పడుకున్నారు. హమ్మయ్య నీ దయ వల్ల అవకాయ పూర్తి ఇయ్యంది అంటూ డబ్బు ఇవ్వ పోయింది.
వద్దు మాకు ఊరగాయ వారం తరువాత పెట్టీ ఇద్దరు కానీ అన్నారు. బామ్మ చేతి అవ కాయ మహా అమృతం అన్నారు. రేపు మాత్రం రవణను కుడా తీసుకు రండి అది ఎండు మిరపకాయలు దంచుతుంది. నేను వేయించి ఇస్తాను మీ ఇద్దరు జల్లించాలి అన్నది. సరే అంటూ వాళ్ళు వెళ్లిపోయారు. బామ్మ ఇంత కష్ట పడు తోంది అనుకున్నాడు రాహుల్. ఒరే రాలు గాయి చూసావా నీకు ఏమి తెలియదు అన్ని తెలుసుకో మని మీ నాన్న ఇక్కడికి పంపాడు. అవునే బామ్మ. రేపు ఏవో నల్లగా ఉన్న కాయలు చూపించాడు అవి తెస్తాడు అన్నాడు. అవును అవి ఎంత రుచో కదా అవను అన్నది బామ్మ ఎప్పుడు తెల్లారు తుంది ఎప్పుడు తెస్తాడు కొత్తగా ఉన్నాయి తినాలి అనుకున్నాడు
మర నాడు ఉదయం కాయలు బస్తతో తెచ్చి విధు గదిలో పెట్టీ వెళ్ళాడు. మన రాహుల్ వేగంగా వచ్చి కాయ తీసుకుని పళ్ళతో కొరికాడు అబ్బ అంటూ అరిచాడు. ఏమిటి అంటూ ఇంట్లో వాళ్ళు అంతా వచ్చారు. సరే వీడికి తినడం తెలియదు ఎవరిని అడుగడు అంటూ నవ్వు కొన్నారు. ఈలోగా ఇంటిల్లి పా ది ఏమైంది ఏమైంది అని పరుగెత్తుకుని వచ్చారు రాహుల్ పనికి విచిత్రంగా చూసి నవ్వు కొన్నారు ఆ విషయం. ఆ విధి అంతా తెలుసు కోని పట్నం పిల్లాడు చదువు తప్ప ఏమీ రావు అన్ని నేర్పాలని ఇక్కడకి పంపారు అన్నారు. ఆ తరువాత మధ్యాహ్నం వెంకన్న వచ్చి ముంజలు తినే  విధానం నేర్పాడు ఇంకేమి వెంట వెంటనే పది ముంజలు తినేసాడు. మర్నాడు తెల్ల వార గల్టే బామ్మ స్నేహితులు ఓ ఆరుగురు వచ్చారు వాళ్ళు పెద్ద వాళ్ళే అందులో కొంచెం అమ్మ వయసు ఆవిడ వచ్చింది ఆవిడ రమణ అని తెలిసింది. అప్పటికే మా పెద్ద అత్త ఇండ్లి వేసి కొబ్బరి మామిడి చట్నీ చేసి ఉంచిధి అంతా కలిసి పెళ్లి వర్లా నెయ్యి పోసుకుని ఒక్కొక్కళ్ళు ఎనిమిది ఇడ్లి తిన్నారు రెండేసి వాయిలు లగించాక ఎండ్డు మిరపకాయలు ముక్కలు చేసి పెద్ద గిన్నె పొయ్యి పై పెట్టీ నూనె వేడిచేసి అందులో వేసి పెద్ద అట్లా కాడతో తిప్పుతూ పాటలు మొదలు పెట్టారు. ఈలోగా బామ్మ వచ్చి మీరు పాటలు మాటలు వద్దు నోట్లోకి గొడ్రు వస్తె తుమ్ము వస్తుంది దగ్గు వస్తుంది. మీ కట్టుడు పళ్ళు అందులో పడితే నాకు కారం కాకుండా పోతుంది అని కసిరింది. ఈ లోగా రమణలు ముక్కుకి గుడ్డ కట్టింది. అదే మాస్క్ మాదిరి దళసరి బట్ట ఈ లోగా రాహుల్ అందరికీ
డిస్పోజెల్ మాస్క్లు తెచ్చి ఇచ్చాడు. మొత్తనికి రమణ వేగిన మిరప కాయలు వేయించి మెంతులు వేయించి పెద్ద పెద్ద బకెట్స్ లో పోసింది బామ్మ దగ్గర చాలా రకాలు ఉన్నాయి. ఆ తరువాత రెండు రోల్లు లో నాలుగు రొకళ్ళీ పెట్టుకుని తెల్ల వార గట్లే కారాలు కొట్టేశారు. వేయించిన కారం మొత్తం ఆరువందల కాయలకి ఎనిమిది కుంచాల కారం కొట్టు కుని మెంతులు నాలుగు కుంచాలా మెంతులు కొట్టీన పొడెం కలిపి రాళ్ళ ఉప్పు నాలుగు కుంచాలు కలిపి ఉంచారు. ఇంకా పది మంది గబగబా కొంచెం తుక్కు తీసి గుత్తి వంకాయ మాదిరిగా రెండు వైపులా చెంకలు కోసి ఇచ్చారు. ఇంకో నలుగురు గభ గబ ఈ వేపుడు కారం కురు కొని పెద్ద పెద్ద మట్టి గూనల్లో వేసి గుడ్డ వాసిన గట్టారు అల నాలుగు గునల్లో ఊరగాయ పెట్టారు. బామ్మ నవ్వుతూ ఒకందుకు ఈ ముతి గుడ్డలు మాకు ముక్కు రుమాళ్ళు వచ్చాక నాకు చాలా క్షేమంగా ఉన్నది. లేదంటే ఈ కట్టుడు పళ్ళ బామ్మల అందరూ కలిసి తుమ్ము దగ్గి తుంపర్లు పడేసేవారు ముక్కు చిదు ళ్ళు లేవు అన్నది. కుతూహలం గా అల్లరిగా అదేమిటి అని రాహుల్ వాడు స్నేహితులు అడిగారు. ఈ కోతి ముక అంతా కూడా వచ్చారు అంటూ వీళ్ళకి ముంజికళ్ళు తినడం కూడా రాదు ఫ్రిజ్ లోంచి తీసి పళ్ళెంలో పెట్టుకుని రాహుల్ పట్టుకెల్లే పెట్టరా అన్నది
సిటీ చదువులు గొప్ప కానీ కొబ్బరి బొండం తాగడం ముని కళ్ళు చేతితో తీసుకుని తినడం మామిడి పడు పీల్చుకుని తినడం కొబ్బరి బొండం తాగక గుజ్జు  బొటన వేలు తో చేతితో ఎలా తినాలి అని వేళ్ళకి కోచింగ్ ఇస్తాను అన్నది. ఈ లోగా ఓ బామ్మ తెగ నవ్వింది వీళ్ళ మాటలకి నీ నవ్వు బాగానే ఉన్నది కానీ గట్టిగా నవ్వవు పళ్ళు రాలిపోతాయి అన్నది బామ్మ కోపంగా, అవును మీకు అలవాటు అంటూ ఇంకా అవిడ నవ్వింది. కారణం ఓ ఏడాది ఇలాగే వేపుడు కారం కొట్టక కుంచంజ్ లెక్కతో కారం కొలుస్తుం టే నాలుగు నొక్క టీ అంటుంటే పళ్ళు మొత్తం ముందువీ కట్టుడివి అనుకుంటా అవి వెళ్లి కుంకంరంగు కారంలో పడి తెల్లగా మెరుస్తూ వెక్కి రుంచా యి అమ్మగారు చూడకుండా వాటిని తియ్య బోయింది. ఎలా చూసింది కానీ బామ్మ పట్టేసి అపు నీ కొలత అని అరిచింది. వెంటనే మనిషి పేరు వెంకాయమ్మ అపూ అపూ అంటూ కుర్చీ లోంచి లేచింది. ఏడాది పొడుగునా నీ ఎంగలి మేమంతా తిని పాపం కట్టుకోవాలి అంటూ ఉరిమి చూసి చాలా కోప్పడింది దానికి చుట్టుపట్ల వాళ్ళు చోద్యం చూసి నట్లు చూసి నవ్వుకుంటూ ఆచారం బామ్మ అని వెక్కి రిస్తూ వెళ్లారు. నా ఊరగాయలు కి ఎవరో దిష్టి పెట్టారు అంటూ బామ్మ తెగ బాధ పడింది. ఆ కారం అంతా వెంకాయమ్మ నే పట్టుకెళ్ళి వాడుకో అన్నది.
ఆమె మహాతల్లి రెండు వేలు ఖరీదు చేసే కారం ఇచ్చింది అని కళ్ళకి అడ్డుకుని పట్టుకెళ్ళినది
అప్పటినుంచి ఊరగాయ పగలు కాకుండా తెల్ల వరగట్ల పెడుతుంది. అన్ని పెట్టాక వాసన కట్టాక హారతి ఇస్తుంది. సెలవల్లో మన వల చేతి చక్కగా శ్రీ వేంకటేశ్వర దీపారాధన సత్య నారాయణ వ్రతం చేయించి స్నేహితులు పిలిచి ప్రసాదం పంచి పెట్టిస్తుంది. అల మనుష్యులలో ఐకామత్యం ఉండాలి అంటంది. కొత్త ఊరగాయ చిన్న డబ్బాల్లో పెట్టీ తెలుసున్న వారికి పెద్ద డబ్బాల్లో పెట్టే సహాయం చేసిన వాళ్ళకి ఇస్తుంది. బామ్మ ఇప్పటికీ ఏ పని అయిన సరే తెల్ల వార గట్ల రెండో మనిషికి తెలియకుండా అన్ని పనులు అవిడ స్నేహితులతో కలిసి చేస్తుంది హాయిగా ప్రతి ఉదయం శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు పాడు కుంటు పూజలు చేస్తూ పనులు చేస్తుంది. విదేశాల సిటీలో మనుమమాలకి అవిడ ఈ కధ చెపితే తెరలు తెరలు గా నవ్వు కుంటారు. అంతే కాదు ఊరగాయ కలిపి నోరు ఊరిస్తూ తిన్నప్పుడల్ల  బామ్మనే తలుచుకుంటే ఉంటారు. రోజుకి పదిసార్లు అయినా పలక మారితే నా ఊరగాయ తింటూ నన్ను ఎదో ఎవరో తలచు కుంటున్నాను అంటూ ఆనంద పడుతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!