మాతృహృదయం

మాతృహృదయం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

ఒరే కాముడు అమ్మ చెప్పింది వినరా. మనుషులంతా ఒకటే. అందరిలోను ప్రవహించేది ఎర్రటి రక్తమే. కులమతభేదాలు మనం కల్పించుకున్నవే. మతం కాదు మానవత్వమే ముఖ్యం అన్నది అక్షర సత్యమే. నేను ఒప్పుకుంటాను. మేము అనుభవం తో చెప్పేది కూడా విను అని సుబ్బారావు గారు తన పుత్రరత్నం కాముడు అని పిలవబడే కామేశ్వరరావుతో  చెపుతున్నారు. బాల్యం నుంచి మన సంప్రదాయ కట్టుబాట్లు, వేష భాషలు, మతం చివరికి తినే తిండి దగ్గరనుంచి అన్నిటా వ్యతిరేక విధానాలతో ఆస్ట్రేలియా లో ఉన్న ఆ పిల్లతో పెళ్ళి ఎలారా చెప్పు అమ్మ ఒక్కగా నొక్క పిల్లడివి అని గంపెడాశతో
కోడలు ముచ్చట్లు అంటూ వెఱ్ఱిది ఊహించు కుంటుంది. అమ్మ నా కన్నా నీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం నీకు తెలసు. నేను ఎలిమెంటరి స్కూలు లో చిన్న గుమస్తా అయినా నీ భవిష్యత్ బాగుంటుంది అని తన పుట్టింటి వారిచ్చిన స్థలం, బంగారం అమ్మి నే వద్దంటున్నా నిన్ను ఆస్ట్రేలియా ఉన్నత చదువులకై పంపిందిరా ఆలోచించు. పూర్వీకులు లా కాక పోయినా గోదావరి తీరంలో ఉన్న ఈ లంకంత పాత ఇంట్లో ఇప్పటికి పూజలు, పునస్కారాలు, కార్తీకమాసం, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి అంటు ఎన్నో ఎన్నెన్నో శరీరం సహకరించక పోయినా
నీ కోసం మన కుటుంబం కోసం చేస్తోంది. నువ్వే చూస్తున్నావు నీవు పెళ్ళి విషయం చెప్పిన ఈ వారం రోజులుగా ఏమి తినక ఎలా పాడై పోయిందో. ఎంతైనా మనం సమాజంలో ఉన్నాము. మనకొరకె మనం బ్రతకాలి అన్నది ఉపన్యాసాలకే పరిమితము. సమాజం ఏమనుకుంటున్నారో అనే భయంతో ఇప్పటికీ తొంభై శాతం ప్రజలు బ్రతుకుతున్నారు. ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఏమంటున్నారు. మన సంప్రదాయాన్ని, సంస్కృతిని పాటిస్తు ఇతరులు కూడా పరమేశ్వర స్వరూఫులే వారిని ప్రేమగా చూడండి అంటున్నారు. అమ్మ సాక్షాత్తు పరదేవతయే ఆమె మనస్సును నొప్పించకురా అంటున్న సుబ్బారావు గారితో  కొడుకు నాన్నగారు మీరు ఇంకా చాదస్తాలు పెట్టుకుంటే ఎలా వసుదైక కుటుంబం అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా అది మీరు చిన్నప్పుడు అనేవారు. మీకే లోటు రానివ్వం. మేము అక్కడ సిటిజెన్స్. మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాము కంటికి రెప్పలా చూస్తాం అన్నాడు.
ఒరే ఇది జరిగే పని కాదు చిన్నపిల్లాడివి కాదు డాక్టరేట్ పొందిన ముప్పై ఏళ్ళు దాటిన శాస్త్రవేత్తవి నాలా గుమస్తావి కావు అంటున్న భర్తతో గదిలోంచి భార్య సుభద్రమ్మ గారు వచ్చి ఊరుకోండి ఆవేశపడకండి వాడి జీవితం వాడిది అని నీ ఇష్టం ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండరా కాముడు నా ఆయుష్షు కూడా పోసుకుని నిండా నూరేళ్ళు జీవించు పెళ్ళి చేసుకుని మమ్మల్ని మరచిపోకు ప్రతీ సంవత్సరం వాస్తు ఉండు అన్నారు. తల్లి తో మేము వాళ్ళ సాంప్రదాయం ప్రకారం చర్చిలో పెళ్ళి చేసుకుని తరువాత నెలలోపు ఇక్కడకు వచ్చి సత్యనారాయణ వ్రాట్స్మ్ చేసుకుని చిన్న విందు నీ సాయి భజన వాళ్ళకి, నాన్నగారి స్నేహితులకి ఇస్తాము అంటే మనస్సులో బాధ ఉన్న ప్రేమతో సుభద్రమ్మ గారు కొడుకు తల నిమురుతూ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అదే ఈ వయస్సులో మాకు కావలసింది అన్నారు. సారిగ్గా రెండు నెలల తరువాత కామేశ్వరరావు ఇండియా వచ్చిన వెంటనే తల్లి ఏదిరా నీ భార్య అనగానే ఆమె చెయ్యి పట్టుకుని అమ్మా నేను మీతో ఏకీభవిస్తున్న ఆ అమ్మాయి నాతో మీ పరిస్థితులు, సంప్రదాయం వేరు ఆచార వ్యవహారాలు వేరు నీతో నేను డేటింగ్ చేసాను ఏమనుకోకు అని  తడబడుతు చిన్నపిల్లాడిలా చెప్పాడు. అమ్మా నన్ను మొదటి నుంచి ఇష్టపడుతున్న చేనులు మామయ్య గారి మీనాక్షి ని పెళ్ళి చేసుకుంటాను. ఈ విషయం పూర్తిగా పదిహేను రోజుల క్రిందట చెపితే మీనాక్షి అంగీకారం చాటింగ్ లో తెలియచేసింది. తల్లిదండ్రులు అనుభవంతో చెప్పే మాటలు అక్షర సత్యాలే అంటు తల్లి ఒడిలో చిన్నపిల్లాడిలా తలపెట్టుకుని కన్నీటి పొరలను చెంగుతో తుడుచుకుంటున్న కొడుకుతో పోనీలేరా కాముడు తిరుపతి వెంకన్న దయవలన ఇదీ మనమంచికే జరిగింది అని అంటు హృదయానికి కొడుకు తల నిమురుతూ హత్తు కోవడం చూసిన సుబ్బారావు గారు తల్లి హృదయం అంటే ఇదే కదా అనుకున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!