(అంశం:: “చాదస్తపు మొగుడు”)
ఆచారమె ముద్దు
రచయిత :: సుజాత కోకిల
మడి మడి అంటే ముక్కుమీద వేలు వేసుకున్న
దూరం దూరం ఆంటే ఏదో నీది చాదస్తం అనుకున్న
ఈ చాదస్తపు మొగుడితో ఏలారా నా కాపురం అనుకున్న
పక్కవేరు దుప్పటివేరు కంచమువేరు నాలుగు రోజులు దూరం అంటే
ఈ రోజులలో కూడ ఈ మూఢ నమ్మకాలు ఏంటిరా దేవుడా ఆనుకున్న
ఇప్పుడు తెలిసింది నీది మూఢనమ్మకం కాదు పద్దతి అని
దూరం అంటే గొప్పలు కాదు శుచిశుభ్రత ఆని
ఎలా నా జీవితం ఈ చాదస్తంతో అనుకున్న
ఇది చాదస్తం కాదు సాంప్రదాయం అని తెలుసుకున్న
పంచె కట్టుకుని మెడలో రుద్రాక్ష మాల వేసుకుని
నుదిటిపై కుంకుమ పెట్టుకుని ఉంటే
ఏంటిరా నా మొగుడు పగటి వేషగాడిల ఉన్నాడు అనుకున్న
కాని అదే నాకు తిండీ బట్ట అదే నాకు మర్యాద అని తెలుసుకోలే
నీది చాదస్తం అంటు నిన్ను ఎంతో బాధపెట్టిన
నన్ను ఎమి అనలేక నవ్వి ఊరుకున్నావు.
అప్పుడు ఆ నవ్వుకు కారణం ఎంటొ తెలుసుకోలే
ఇప్పుడు చూట్టు చీకట్లు కమ్ముకున్నాక కాని
తెలిసి రాలే
వెలుగు దేవత మాయమైయింది జీవితాలు
అన్ని అందాకార మయమైనవి
అంతా ఆర్తనాదాలు ఎక్కడ చూసిన కుప్పలు కుప్పలుగా శవాలు
ఎన్ని చాదస్తాలు ఆన్నారో అదే మనకు ఆయుధంగా మారింది
అందుకే మూతికి మాస్కులు పెట్టుకోండి దూరాన్ని పాటించండి
కరోనను తరిమికొట్టాలి చాదస్తం అనోద్దు చాదస్తం
ఒక అద్దు నాచాదస్తం మొగుడే ముద్దు