(అంశం:: “చాదస్తపు మొగుడు”)
మూఢాచారి
రచయిత :: లోడె రాములు
అబ్బబ్బ ..పొద్దున్నే లేచింది మొదలు
తుమ్మినా,దగ్గినా,శకునం అరిష్టం..
ఆపతి, సాపతికి వెళ్దామంటే వర్జ్యం ముహుర్తాలు అంటాడు..
ముక్కు మూసుకొని జపం చేస్తుంటాడు..
ఆచారాలు సరే..కానీ
ఈ మూఢాచారుని తో ఎగేదెట్టా…
అన్నీ తెలిసిన వాడే..కానీ
గుమ్మడికాయoత వెర్రి ఉంది..
అభంశుభం తెలియనోడనుకుంటే..
అన్ని తెలువులు బాగానే ఉన్నాయి
ఉద్యోగం సద్యోగం లేక గుండ్రాయిలా తిని తిరుగుదామంటాడు..
తలతిక్కల పనులు జేస్తూ..
సుట్టుపక్కలోళ్ల తోటి పంచాయతీలు తెస్తుండు..
మడి.. ఆచారం అంటాడు..
మనుషుల్ని దూరం చేసుకుంటాడు
చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ,
చేపిస్తూ పొద్దస్తమానం పానం తీస్తున్నాడు…
విసిగి అమ్మ గారింటికెళితే..
వెంటనే ఆడి కొస్తాడు..
కొండంత ఉన్న తాతల ఆస్తిని..
గుండు సూదoత చేసేట్టున్నాడు.
ఈ చాదస్తపు మొగుడితో ఏగేదెట్టా
ఈ జీవితాన్ని ఎదురీదేట్లా…
కర్రు కాచి వాత పెడతా..
ఎట్లయినా….సరే…