ఏమిటి..ఈ గతి

ఏమిటి..ఈ గతి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: గాజులనరసింహ

అడుగడుగున ఆకలి పో
రులో అలమటిించె జనము
ఈ సామ్యవాద దేశం
లో ఎంతో పోరాటము
జరుగుతుంది నిత్యము
ఇలా దినదినము.

పలికేరు అందరూ..
ఎన్నో ప్రగల్భాలు
మార్చలేదు ఈ స్థితిని
వచ్చిన ఏ నాయకులు
అందరూ అవకాశవధులే
అంతా పిసినారి బుద్ధులే.

పేరుకేమో మనది
భాగ్యోన్నతి దేశము
ఆకలిదప్పులకేమో
దారిద్రపు దేశము
వారెవ్వా! న్యాయ చట్టాలు ఎన్ని
వున్నా.. ఇందుకు స్పందించునా..?

పుస్తకాల్లో రాసేరు
ఎన్నెన్నో రాతలు
చేతగాని వ్యక్తుల
వట్టి పిచ్చి గీతలు
ఇదేనేమో  సామ్యవాద దేశము
ఇదేనేమో అన్నపూర్ణ దేశము

దగుల్బాధ్యులకెందరి
కో పట్టం గట్టింది
బలహీనుల నెందరినో
బజారుకు తోసింది
చూడరా..!నవభావితుడా
ఈ వ్యవస్తతీరు..

స్వదేశీ సొమ్ములను
దోచి పరదేశిలో
దాచేరు ఎంతెంతో
బినామీ పేరులో
నిర్భాగ్యులను నిలువునా
ముంచేది గొప్పోలే …

ఇది స్వతంత్ర దేశము
ఆకలున్న రాజ్యము
పాడి పంటల దేశము
పెట్టెడు మెతుకులు సూన్యము
ఇక్కడ పైసలుంటేనే
నడువును జీవితం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!