నిశిలో శశి!

నిశిలో శశి!

రచన: ఎం.వి.చంద్రశేఖరరావు

నిశిరాత్రి వేళలలో,
గాఢాంధకారంలో,
ఉలిక్కిపడి, నిద్రలేచి,
గగనంవంక,ఇలాతలం
వంక చూస్తూ,గమ్యంలేని
నావికుడిలా, దిక్కులు చూస్తూ,చీకట్లో జీవితం గడపకు!
ఓ కవీ,ఓ పవీ,
నిశిలో శశిలా నవ్వులు చిందిస్తూ,
చల్లని వెన్నెల పంచుతూ,
అఙ్ఞానతిమిరాలను తరిమి
కొడుతూ,
విఙ్ఞాన వెలుగులను
పంచిపెడుతూ,
తళుకు బెళుకు తారకల మెరుపులతో,
ఆర్తులకూ,అనాధలకూ,
ఆకలికేకలకు, దారిచూపే
దీపం నువ్వు కావాలీ!
ఈ జగతికి వెలుగుబాట చూపాలీ!
నిశిలో శశిలా చల్లదనాన్ని
పంచాలీ!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!