ఇది తగునా నీకు?

ఇది తగునా నీకు?

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

డియర్ శ్రీకాంత్,
ఈ మెసెజు నీకు రాయాల్సివస్తుందని అనుకోలేదు.రాయక తప్పలేదు.కలిసి చదుకున్నాం.
కలిసి తిరిగాం.కలిసి ఎన్నో కలలు కన్నాం.ఒకరినొకరు
విడిచి ఉండలేనంతగా ప్రేమించుకున్నాం.ఇవేవి నేను
కాదనటం లేదు.కాని అనుకోని పరిస్థితులలో నేను
ఇలా చేయాల్సివస్తోంది.అన్యధా భావించవద్దు.నన్ను
క్షమిస్తావని ఆశిస్తూ.నీది కానీ నీ నీరజ.
మెసేజు చూసి శ్రీకాంత్ నిశ్చేష్టుడయ్యాడు.ఒక్కసారి
తలంతా గిర్రున తిరిగి నట్లైంది.నీరజకేమయ్యింది.
తనతో చెప్పలేనంత విషయం ఏమైంటుంది?
ఫోను చేశాడు.రింగైంది.ఎత్తలేదు.మరోసారి చేశాడు.
మళ్ళీ రింగైంది.ఎత్తలేదు.కాస్సేపాగి చేశాడు.ఈ సారి
స్విచ్చాఫ్ అని సమాధానం వచ్చింది.ఇంటికి వెళ్ళి
కలిస్తే.నీరజ ఇంటికి బయలుదేరాడు.
ఇంటికివెళ్ళి తలుపు కొట్టాడు.చాలా సేపటివరకు
ఎవరూ తీయలేదు.కాలింగ్ బెల్ కోసం చూశాడు.
లేదు.మళ్ళీ కొట్టాడు.
తలుపులు తెరుచుకున్నాయి.ఒక యువకుడు
ఎవరు కావాలంటూ ఎదురుగా నిలుచుచున్నాడు.
నీరజ వాళ్ళింట్లో అందరూ తనకు తెలుసు.ఇతనెవరో
ఇంతకు ముందెప్పుడూ చూడలేదే అనుకుటుండగా
ఎవరు మీరు ?ఎవరు కావాలంటూ ఆ యువకుడు
ప్రశ్నించాడు.
“నీరజ నీరజకావాలి”అని శ్రీకాంత్ అడిగాడు.
“నీరజతో మీకేంపని”ఆ యువకుని ప్రశ్శ
“నేను నీరజ స్నేహితుడిని.”శ్రీకాంత్ జవాబు
“స్నేహితుడిని అంటే ఎలాంటి స్నేహం”ఈసారి ఎగతాలిగా ఆ యువకుడి ప్రశ్న.
ఇదేం ప్రశ్నరా బాబు అని అనుకున్నాడు శ్రీకాంత్.
“ఇద్దరం కలిసి చదువుకున్నాం”శ్రీకాంత్ జవాబు
“అయితే ఏంటి?అంతగా తనతో ఏం మాట్లాడుతావు.
ఇప్పుడు తను ఎవరితోను మాట్లాడదు.నువ్వెళ్ళొచ్చు.”ఆంటూ తలుపులు వేసేశాడు.
ఇక చేసేదేం లేక వెనుతిరిగాడు శ్రీకాంత్.
ఈ పక్కనే నీరజ స్నేహితురాలు పద్మజ వుందికదా.
తనను కలిస్తే వివరాలు ఏమైనా తెలుస్తాయేమో అనుకుంటూ పద్మజ వాళ్ళింటికి వెళ్ళాడు.ఇంతకుముందు ఒ రెండుసార్లు పద్మజవాళ్ళింట్లొ నీరజ శ్రీకాంత్ లు కలిసి మాట్లాడుకున్నారు.
పద్మజ ఇంట్లోనే వుంది.శ్రీకాంత్ ను చూసి తాను
ముభావంగానే పలకరించి లోపలికి రమ్మంది.
పద్మజ వాళ్ళ అమ్మ ఎవరే వచ్చిందంటూ లోపలినించేఅరచింది.
“మా ఫ్రెండమ్మా!”పద్మజ బదులు చెప్పింది.
“సరే!వేగంగా మాట్లాడి పంపేసెయ్”పద్మజ వాళ్ళ ఆమ్మ మళ్ళీ లోపలినుంచె అరచింది.
“సరేనమ్మా” పద్మజ జవాబు.
శ్రీకాంత్ వైపు తిరిగి”నాకు తెలుసు శ్రీకాంత్ నువ్వు
తప్పకుండా వస్తావని.నాకు ఏమి అర్ధం కావటం లేదు.
పక్కన వున్న నాతోకూడా నీరజ మాట్లాడి చాలా
రోజులైంది.ఈ వారంరోజులలో ఒక రోజు ఫోను చేసి
మాట్లాడబోతుంటే ఫోను ఎవరో కట్ చేశారు.మళ్ళీ నేను ఫోను చేష్తే స్విచ్చాఫ్ అని వచ్చింది.ఎన్ని సార్లు
చేసినా ఫోను పలకలేదు.ఇక చేసేదేంలేక ఇంటికి వెళ్ళాను.కాని దానిని కలిసే అవకాశమే దొరకలేదు.”
పద్మజ చెప్పింది.
“నీకు ఏమి తెలియదన్నమాట.నాకు చేదు అనుభవమే ఎదురైంది.ఇంతకీ అతనెవడో చాలా
రూడ్ గా మాట్లాడుతున్నాడు.ముఖంమీదే తలుపులేసేశాడు.పోని నీరజ వాళ్ళ నాన్నగారి ఫోను
నెంబరైన వుంటే ఇవ్వు ఆయనతో మాట్లాడుతాను.”
శ్రీకాంత్ పద్మజను అడిగాడు.
“ఆయన ఫోనుకూడా స్విచ్ఛాఫ్ అయివుంది శ్రీకాంత్.
వాళ్ళింట్లో ఎవరిఫోను పలకటంలేదు.అసలేమైవుంటుందో అర్ధంకావటంలేదు.రోజుకు రెండుసార్లైనా నేనుగాని
మా అమ్మగాని వాళ్ళతో మాట్లాడే వాళ్ళం.అసలు
ఆ అవకాశమే లేదు.”పద్మజ చెప్పింది.
“సరే!ఎంచేస్తాం.నెనెంతగానో ప్రేమించాను ఉద్యోగంరాగానే ఇద్దరం పెళ్ళి చేసుకుందామని అనుకున్నాం ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా
వుంది పద్మజ.అసలు విషయం తెలియక మరింతగా
బాధ పెరుగుతోంది.”శ్రీకాంత్ వాపోయాడు.తనకు
నీరజ పెట్టిన మెసేజు చూపించాడు.పద్మజకూడా
చెప్పింది తనకూ టూకిగా మెసేజు పెట్టిందని.దానర్ధం
మనమిద్దరం ఇక కలవలేమని అని పద్మజ చెప్పింది.
బాధాతప్తహృదయంతో శ్రీకాంత్ ఇంటికి వెనుతిరిగాడు.
—— – ——————
ఒక రెండ్రోజులు పోయాక పద్మజ ఫోనుచేసింది
శ్రీకాంత్ కి.నీరజ ఇంట్లో ఉరివేసుకొని చనిపోయిందని.
పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి తీసుకొని
వెళ్ళారని.ఆ యువకుడెప్పడటినుంచో నీరజను
బ్లాక్మెయిల్ చేస్తున్నాడని.ఒకరోజు ధౌర్జన్యంగా ఇంట్లోకి
జొరబడి అందరి ఫోన్లు లాక్కొని నానా రభస చేశాడట.అందరిని నానారకాలుగా హింసిస్తూ
ఎవరిని బయటకు వెళ్ళకుండా గృహనిర్భందంచేసేశాడట.నీరజను పెళ్ళిచేసుకోమని
ఒత్తిడి చేయడం లేకపోతే బలవంతం చేస్తానని బెదిరించేవాడట.ఇక తెగించెద్దామని వాడు ఏమరపాటుగా ఉండడంచూసి తలుపుతీసుకొని
బయటపడదామనుకుందట.వాడు పశువులా మీదపడి గదిలోకి లాక్కెల్లి బలత్కారం చేశాడట.అదే
అదనుగా నీరజ తల్లిదండ్రులు లేని ఒపిక తెచ్చుకొని
పోలీసు స్టేషనుకెల్లి రిపోర్టు చేయడం.వాళ్ళొచ్చేలోపు
జరగాల్సిన అనర్ధం జరిగిపోయిందని పద్మజ వివరంగా
శ్రీకాంత్ కు చెప్పింది.శ్రీకాంత్ కళ్ళనుండి కన్నీటి
ధారలు కురిశాయి.నీరజ ఇది నీకు తగునా అనుకున్నాడు శ్రీకాంత్.
********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!