భారత మాతకు వందనం

భారత మాతకు వందనం

రచన: లోడె రాములు

వందేమాతరం మాతృభూమికి నీరాజనం
స్వాతంత్ర్య సమర గర్భంలో
పుట్టిన ఐతి హాసిక గీతం
కుల మత బేధాలు మరచి
దేశభక్తులను ఉత్తేజ పరచిన గీతం
జనగణమన భరతమాతకు ప్రశంస గీతం
జాతీయ గీతాలు,జాతీయ చిహ్నలు
ఇవే దేశభక్తికి స్థిర సంకేతాలు
మూడువైపులా ఎగసిపడే సాగర ఘోష
ఉత్తరాన ఉత్తుంగ హిమ శ్రేణి
సుజల సంపన్న దేశం నా దేశం
సముజ్వల సంస్కృతికి సజీవ వారసులం
ఆణువణువున చైతన్యం ధర్మ పోరాటమే శరణ్యం
యోగాగ్నిలో హవిస్సులా తనను అర్పించుకొని
జాతీయ ఆత్మను జాగృతం చేసిన స్వామి వివేకానంద
కులాతీత సమతా సిద్ధాంతాన్ని చాటిన రామానుజుల మార్గం
ఒంటి మీద నూలు పోగులేదు
నలుదిక్కులనే వస్త్రాలుగా ధరించిన రాజసం
బోగాల మాయలో పడిన ఆధునిక సమాజానికి ఓ సందేశం
శ్రావణ బెళగోళ బాహుబలి విశ్వంభరత్వం
శ్రీ రామ నామమే తారకమంత్రం
మనల్ని గన్న భారతమాతకు వందనం
ఎందరో మహానుభావులు అందరికీ
జేజేలు…
***********************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!