ముద్దుల కృష్ణయ్య
రచన: శిరీష వూటూరి
ప్రతి తల్లి తన
బిడ్డను నీలా అలంకరించి
మురిసెనయ్యా
మురిపాల మురళీ
ముద్దుల కృష్ణయ్య
మన్ను తిని నీ నోటిలో
ముల్లోకాలను చూపించిన
నల్లనయ్య
నీ లీలలు ఎన్నని
వర్ణించేమయ్య నీలి
కన్నుల కన్నయ్య
అల్లరిలోనైనా,స్నేహబంధం
అయినా,ప్రేమ అయినా,
అసురుల వధ అయినా
గీతోపదేశం అయినా
నీవు చేసిన మాయలు
మమ్ము మంత్ర ముగ్ధులను
చేసేనయ్య గోపయ్యా..