అంతే కదా నీ మాయ

అంతే కదా నీ మాయ

రచన జయ

నీ నిలికళ్ళు చెప్పే ఊసులు
నా మదిని తాకే అమృతజల్లులే కదా

నీ మోమున విరిసిన తేజస్సు
పున్నమి చంద్రుని వెన్నెల కాంతినే కదా

నీ గారాల పిలుపులే
నా మనస్సును మైమరిపింప చేసే వేణుగానాలే కదా

నీ చేతి స్పర్శ
నా తనువును పులకింపచేసే విరజాజులు పరిమళాలే కదా

నీ అధరం అందించేది
మధురమైన సుధలే కదా

నీ ప్రేమ
జగాలను మరిపించి నను నీలో కలిపేసుకునే
బిగికౌగిలే కదా.

అంతే కదా నీ మాయ …కన్నా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!