ఈ గుండె పదిలం ఎన్నడో?

ఈ గుండె పదిలం ఎన్నడో?

రచన:పద్మావతి పి

గుండెలనిండా బరువెక్కిన బాధలతో
దినదినగండంగా బతికే మానవ జీవితం..
అత్యాశల ఆరాటంతో, ఆకాంక్షల అలసటతో చైతన్యములే కోల్పోయిన
మానస నిస్తేజం..
బంధాలని మరిచి ఈర్ష్యా ద్వేషాలతో
విద్వేషాలను పెంచే మానసిక కాలుష్యం..

లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకునే శృతిలయలే స్నేహ స్వరమాధుర్య మని
ధ్యాస-ధ్యానం, ప్రేమా-స్నేహం
గుండెల ఆలాపనలే ఆరోగ్యమని
గుండెలను కరిగించే దెన్నడో?

మలినం లేని నిర్మలమైన మనసుతో మెలిగే దెన్నడో?
గుండెలనిండా స్వేచ్ఛా శ్వాసలు పీల్చుకునే దెన్నడో?
నిర్భయమై నాకెదురే లేదంటూ
సాహస ధైర్యాలను గుండెల్లో నింపుకునే దెపుడో?

సచ్చీలసంపదలే వ్యక్తిత్వమని
సత్సంకల్పములే జీవన మార్గమని
స్వచ్ఛమైన ఆలోచనలను గుండెలనిండా నింపుకొందాం
స్వేచ్ఛా స్వాతంత్ర్యములతో
జీవిద్దాం
ఆ రోజుకై నిరీక్షిద్దాం!
తరతరాలకు ప్రేమల నందిద్దాం
గుండెలనిండా నింపుకొన్న శ్వాసల జీవిద్దాం..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!