కవిత
రచన: కాంతి శేఖర్. శలాక
మా మధ్య మరి కొన్నాళ్ళు ఉండాల్సింది బాపు…
కులాల పేరుతో కుమ్మకోకండి అని…
మతాల పేరుతో మంటలు రేపక మంచిగా మసలమని…
మనిషిని మనిషిలా గౌరవించమని…
మహిళ అంటే మాతృమూర్తి రూపం అని…
మాకెవరు బుద్ధి చెబుతారు మరి…
నువ్వు చూపిన సత్య అహింసా మార్గం…
కలహాలు కుతంత్రాల కలుపు మొక్కల మధ్య మరుగున పడింది…
మార్గదర్శి వై మా కోసం మళ్లీ రావా మహాత్మా…