ఆదర్శ సేవ

ఆదర్శ సేవ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభాకరి

సూర్యుడు ప్రకాశవంతంగా చంద్రుడు కాంతి వంతంగా నక్షత్రాలు మెరుస్తూ చల్లని గాలి వీస్తూ ముత్యాల వంటి వర్షం చినుకులు కురుస్తూ. కాలము గుణంగా ఎంతో నిస్వార్థ సేవ చేస్తూ ప్రకృతి అందాలు ఆరబోసిన రీతిలో వెన్నెల వెలుగు కొండలు కోనలు సెలయేళ్ళు పచ్చిక బయళ్ళు ఇవన్నీ భవంతుడు మానవులకు ప్రసాదించిన వరాలు అయితే స్వార్థ మానవుడు వీటి విలువ కనుక్కుని తను ఆర్థికంగా ఎగిగడనికి వాడు కుంటు
ఆది మానవుడు ఆధునిక మానవుని గా మారి విజ్ఞాన ప్రగతి లో కొంత అజ్ఞానంతో అహంకారంతో కొన్ని విలువైన అంశాలు తనకి అనువుగా మార్చుకున్నాడు. కోమలి పరిశోధనా స్టూడెంట్.
అయితే ఆమె సాహిత్యము కళలు మానవ జీవితం పై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే అంశాన్ని ఎంచుకుంది మరి అలా ఎందు వల్ల కోమలి ఎంచుకుంది అని స్నేహితులు ఎంతో ఆలోచించారు. ఒకే కళ ఎంచుకుంటే ఎలా సాహిత్యం లేకుండా అసలు ఏ కళ లేదు అనేది కోమలి ఉద్దేశ్యము
ఇదే మాట స్నేహితులతో అంటే నువ్వు చాలా క్లిష్ట అంశము ఎంచు కున్నావు దానికి సిరిస్ రాయడం చాలా కష్టము కదా దానికి రిఫరెన్స్ లు కావాలి ఎలా అలా ఎంపిక చేసుకున్నావు. ఎదో ఒక సబ్జెక్టు తీసుకుంటే తేలికగా సాగిపోతుంది. కావాలని కోరుకున్నా చే అంటూ స్నేహితులు హితవు పలికారు. కానీ కోమలి మాత్రం అదే ఎంపిక చేదుకున్నది దీనికి సంగీత కళాకారులు, నృత్య కళాకారులు, శిల్ప కళాకారులు చిత్ర కళాకారులు, ఇంకా గృహ అలంకరణ, వస్త్ర అలంకరణ సామాజిక, జానపద కళలు సినిమాలో కళలు ఇవన్నీ కూడా కూలంకషంగా అధ్యయనం చెయ్యాలి.
అసలు ఒక సినిమా అనేక కళల సమాహారం కదా సినమా లు విజయం సాధించడానికి నిజంగా దర్శకుడు ప్రతిభ పైనే కళాకారులు నటన ఆధార పడి ఉంటుంది కనుక అందరు అభిప్రాయాలు కనుక్కుని రాయడం కష్టం అదే ఒక పుస్తకం అనుకుంటే తేలికగా డాక్టరేట్ సంపాదించ వచ్చును.
ముఖ్యంగా ఒక కళ ఎంపిక చేసుకున్న పర్వాలేదు కానీ కళల సమూహాన్ని ఎంపిక చేసుకున్న కోమలి పై స్నేహితులు భిన్న అభిప్రాయాలు వెలిబుచ్చారు.
కానీ కోమలి మాత్రం చిన్నప్పటి నుంచి కళలపై ప్రేమ పెంచుకున్నధి చిన్నప్పటి నుంచి చిత్ర లేఖనం లో స్వీయ ప్రావీణ్యత కలిగి ఉన్నది కారణం స్కూల్ నుంచి రాగానే హోమ్ వర్క్ చేసుకోవడానికి పై మెడ మీదకు వెళ్ళేది ఆక్కడ ప్రకృతి అందాలు చూసి డ్రాయింగ్స్ వేసుకునేది తన హోమ్ వర్క్ తో పాటు ఇది కూడా ఒక పెర్సొనల్ వర్క్ అయింది. పిల్లలో నీ కళాత్మకత చూసి ఇంట్లో అమ్మ నాన్న తాత అమ్మమ్మ దీనికి మంచి గా బొమ్మలు వేస్తుంది కనుక అది బాగా వచ్చేలా మనం దానికి అవకాశం కల్పించాలి అనుకున్నారు.
ఎన్నో సినరీస్ ప్రకృతినీ చూసి వేసేది ఎగిరే పక్షులు కదిలే మేఘాలు గాలికి ఊగే చెట్ల కొమ్మలు పారే నీరు ఇవన్నీ ప్రకృతి సహజ అందాలు అంతే కాదు సృజన శక్తి ఎక్కవ. కొన్ని ఊహించి చక్కగా వేసేది. పిల్లలో నీ కళ పెద్దలను ముచ్చట పరిచింది. కోమలి తల్లి వెంకట లక్ష్మి డ్రాయింగ్ షీట్స్ పై వేసిన చిత్రాలకు దగ్గర ఉండి రంగులు ఎంపిక చేసి ఆ రంగులు వేయించేది ఆలా వేసిన బొమ్మలకు శీర్షికలు పెట్టీ చిన్న చిన్న మినీ కవితలు రాయించేది అలా కోమలి కొంత చిత్రలేఖన సాహిత్యంలో దిట్ట అయ్యింది.
సంగీతం ఇంటి విద్య ఇంట్లో అమ్మమ్మ అమ్మ రేడియో ఆర్టిస్ట్ లు కనుక ఆటల్లో పద్యాలు మాటల్లో పాటలు నేర్పుతూ ఉండేవారు. అలా కోమలి సంగీతం లో కొంత ప్రావీణ్యత కలిగింది ఇంకా స్కూల్ లో జరిగే కార్య క్రమాలు కోసం కొన్నాళ్ళు డాన్స్ నేర్చుకున్నది హస్తకళలు చెయ్యడం లో నేర్పరీ కనుక శిల్పం పై ఎన్నో విషయాలు తెలుసుకున్నది
ఆసక్తి ఉంటే ఏ విద్య అయినా తేలికగా తెలుసుకో వచ్చని కోమలి తల్లి  చెప్పింది అలా ఆసక్తి మరింత పెరిగింది. శ్రీ వినాయకుడు, శ్రీ వేంకటేశ్వర స్వామి అలిమేలు మంగ, దేవి, శ్రీ సరస్వతి , రాధ కృష్ణుడు, శ్రీ బాల కృష్ణుని బొమ్మలు, యశోద కృష్ణ
లంబాడీలు, అందమైన అమ్మాయిలు బొమ్మలు జపాను బొమ్మలు ఇలా ఎన్నో చిత్రాలు చిత్రించిన రీతి అద్భుతము. అలా కోమలి దైర్యముగా జాయిన్ అయ్యింది పరిశోధన నిమిత్తం గొప్ప గొప్ప కళాకారులను పరిచయం చేసుకుని అవసరమైన అంశాలు నోట్ చేసుకునేది. పరిశోధన కోసం కోమలి ఎంట్రన్స్ రాసి సెలెక్ట్ అయింది. యూనివర్సిటీ స్కాలర్ షిప్ కూడా వచ్చింది. ఈ సబ్జెక్ట్ అటువంటిది. ఐదు ఏళ్ళు కాలం ఉన్నా సరే మూడు ఏళ్ళాల్లో పూర్తి చేసింది పోస్ట్ డాక్టర్ కోసం ఎంట్రన్స్ రాసి సెలెక్ట్  అయ్యింది. మళ్లీ పోస్ట్ డాక్టరేట్ కోసం ఎంతో కష్ట పడింది. జీవితంలో కళలు అనేవి కొందరికే వస్తాయి అది పూర్వ జన్మ సుకృతం అని చెప్పాలి, అయితే కోమలి తన స్నేహితులు కన్నా ముందే డాక్టర్ పట్టా పొందింది కొంచెం స్నేహితులకి బంధువులకు ఈర్ష్య అనిపించింది ఒక రంగం కృషి కే ఎంతో కష్ట పడుతున్న రోజుల్లో ఎన్నో కళల్లో కృషి చేసి డాక్టరేట్ పొందింది. కోమలి తల్లి  కూతుర్ని ఒక్ మల్టీ ఆర్ట్స్ స్కూల్ పెట్టాలని కోరిక చెప్పింది కానీ నువ్వు యూనివర్సిటీ జాబ్ చేస్తే మందేమో అన్నది ముందు నీ డిపార్ట్మెంట్ లో జాబ్ కి అప్లై చెయ్యి కొంత అనుభవం వచ్చాక సొంత స్కూల్ పెట్ట వచ్చును అన్నారు తల్లి తండ్రి సరే పెద్దల మాట సద్ది మూట కదా అంటు నవ్వుకుని డిపార్ట్ మెంట్ హెడ్ గారికి ఫోన్ చేసింది. మంచి పని మేము ఇంటర్వ్యూస్ కాల్ చేసినప్పుడు మీకు తెలియ పరు స్తాము అని చెప్పారు. ఈ లో గా మీరు వచ్చి మా స్టూడెంట్స్ కి కావాల్సిన అంశాలపై వ్యాసాలు తయారు చేసి ఇవ్వండి అని చెప్పారు కోమలి కి యూనివర్సిటీ లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు వచ్చింది. ఈలోగా కోమలి చిత్రాలతో ఒన్ ఉమన్ ఆర్ట్ షోలు ఏర్పాటు చేసి అందరికీ తన ప్రతిభను చాటుకున్నారు తల్లి తండ్రి కూడా కోమలి ఆలోచనలు విని ఆచరణ చేసేవారు అయితే ఆడపిల్ల ఎప్పుడు ఆడపిల్ల విదేశాల్లో కూడా అవకాశాలు వచ్చినా సరే ముందు పెళ్లి చేయండి అని బామ్మ తాత పట్టు పెట్టారు అయితే కళలు అభిమానించే వ్యక్తి కావాలి ఇన్ని కళలు వచ్చి న పిల్ల కదా అన్నారు  కొందరు అమ్మో అన్నారు
మరికొందరు మాకు ప్రదర్శనలు వద్దు అన్నారు
ఇంకొందరు ఇంత చదివిన పిల్లను ఇంటి పట్టున ఉంచడం పద్దతి కాదు జీవితంలో ఎంతి ఏత్తు ఎదగాలి అన్నారు అలా కొన్ని సంభందాలు ఆగి పోయాయి కొందరయితే మాకు నెలకి ఎనబై వేలు సంపాదించే కోడలు కావాలి అన్నారు, అయితే ఆమె ప్రతిభను చూసి ఒక సినిమా డైరెక్టర్ ఒక ఫంక్షన్ లో చూసి అమె వివరాలు తెలుసుకుని ఆమె కళా రూపాలు కొన్ని మేము మా సినిమాకు కావాలని ఎక్కువ మొత్తం డబ్బు ఇచ్చి కోని హీరోయిన్ చేత ఆ చీరలు కట్టించి ఒక పాటలో చూపించారు. కోమలి మంచి చిత్రాలు వస్త్రాలపై పెయింట్ చేసింది కిమొనో బొమ్మలు రాధ కృష్ణ బాల కృష్ణ లంబాడీ బొమ్మలు చీరలు ఇంకా కావాలని ఆర్డర్స్ పెట్టారు
ముఖ్యంగా కోమలి చీరలపై చిత్రాలకు చక్కగా ఆభరణాలు అలంకారాలు పెట్టీ ఎంతో అందంగా చేస్తుంది. ఒక విధంగా కోమలి కళలు సినిమారంగానికి ఎక్కువ ఉపయోగము అందువల్ల కోమలి స్వంత బిజినెస్స్ స్టార్ట్ చేసింది ఒక సాఫ్టు వేర్ ఇంజినీర్ కన్నా ఎక్కువ డబ్బు వస్తోంది ఇది తెలిసిన పాత పెళ్లి సంబంధాలు కబుర్లు పంపారు మీ అమ్మాయిని మా అబ్బాయి ఇష్ట పడుతున్నాడు అని చెప్పారు కూడా కానీ ఒక ప్పుడు సంగీతం సాహిత్యం కళలు కుడు గుడ్డ పెట్టవు అన్నారు కదా ఇప్పుడు ఇలా ఎందుకు మారారు కేవలం డబ్బు కోసమే చేసుకోవడానికి భయపడిన ఎందరో పెద్దలు ముందుకు వచ్చి మెచ్చుకుని మా అబ్బాయికి చేసుకుంటామని చెప్పారు కానీ కోమలి ఆలోచించింది .విదేశాల్లో ఉన్న కోమలి తండ్రి ఫ్రెండ్ తన కొడుక్కి చేసుకుంటానని ఫోన్ చేశాడు
మనిషి విలువ మనిషి సంపాదించే డబ్బు పైనే అని అందరికీ తెలుసు కదా ఈ సమాజం లో ఎంతో ఎత్తు ఎదిగిన ఆడపిల్ల కూడా పెళ్లి విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది అటు పుట్టింట ఒక రకంగానూ అత్త ఇంట మరో రకంగానూ ఉంటాయి
భర్తకి ఇష్టమున్న ఇంట్లో వారికి ఇష్ట ముండదు అందుకే ఆడపిల్లకి పుట్టింట ఎంతో కష్ట పడి నేర్చుకున్న విద్యలు రాణింపు చేసే జీవిత భాగ స్వామి కోసం ఎదురు చూస్తారు ఇది ప్రతి తల్లి తండ్రి బిడ్డ పురోగతి కోసం ఎదురు చూస్తారు అప్పుడే వాళ్ళు నేర్పించిన విద్యకు సార్థకత కల్గి
అత్తింటి పుట్టింటి పేరుకి కీర్తి ఇది ఎందరికో స్పూర్తి.
కోమలి తండ్రి ఆలోచించాడు చాలా రోజులు తరువాత కూడా చిన్న నాటి స్నేహితుడు
కోమలి చేసుకుంటాను మా అబ్బాయికి అన్న మాటలు. అందరికీ ఆనందాన్ని ఇచ్చింది.
అతను ఇండియా వచ్చి ఒక చక్కని బిజినెస్స్ చెయ్యాలని కోమలి చేసే వర్క్ విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నది కనుక ఏ దేశం లో ఉంటేనేమి మనిషి కృషి కళ ఎదగాలి అన్నదే అతని జీవిత ధ్యేయం అందుకే కోమలి ఆ ఇంటిల్లి పాధి ఇష్టపడుతున్నారు. ఈ విషయం బంధువుల్లో ఈర్ష్య కు లోనూ అయ్యారు ఎదో వంకలు పెట్టీ పెళ్లి ఆపాలని చూశారు. కానీ కోమలి విలువ వారికి బాగా తెలుసు అందుకే పట్టు పట్టి సింపుల్ గా అతి తక్కువ మంది బంధువులు సినీ ప్రముఖుల మధ్యలో జరిగింది జీవిత నాటకంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటే కానీ విజయం పొందలేము కదా నా నాటి బ్రతుకు నాటకము అన్న శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన అర్థం చెప్పినా ఎవరూ ఎన్నో భాషల్లో జీవిత నాటకాలు లో జీవితం ధైర్యం గా ధ్యేయంతో సాధించాలి అని కోమలి నిరూపించింది. ఈ సమాజంలో ఎందరో అమ్మాయిలు కోమలి మాదిరి ఆలోచిస్తే విజయం వారికి స్వాగతం పలుకుతుంది.
శాంతి శుభము కలుగును

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!