స్త్రీ ఆవేదన

స్త్రీ ఆవేదన

రచన::క్రాంతి కుమార్ (ఇత్నార్క్)

మహారాణిగా చూసుకోవాల్సిన అవసరం లేదు
నాలుగు గోడల మధ్య బంధించకుంటే చాలు

దేవతలా పూజించాల్సిన అవసరం లేదు
రాక్షసుడిలా హింసించకుంటే చాలు

అగ్రస్థానంలో ఉంచాల్సిన అవసరం లేదు
పాతాళానికి అణగదొక్కకుండా ఉంటే చాలు

గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు
మమల్ని ఒక మనిషిలా గుర్తిస్తే చాలు

తాజమహల్ కట్టించాల్సిన అవసరం లేదు
మా కళ్ళలో కన్నీరు రానివ్వకుండా చూసుకుంటే చాలు

మా కోసం యుద్దాలు చేయాల్సిన అవసరం లేదు
మా మనసుతో యుద్దాలు చేయకుంటే చాలు

మాలో అమ్మతనాన్ని చూడకపోయినా పరవాలేదు
మా ఆడతనాన్ని అపహరించకుండా ఉంటే చాలు

అష్టైశ్వర్యాలు అందించకపోయిన పరవాలేదు
ఆప్యాయత అనురాగంతో అక్కున చేర్చుకుంటే చాలు

ఆడపిల్లను కనకపోయినా పరవాలేదు
పురిటిలోనే చంపకుండా ఉంటే చాలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!