తస్మాత్ జాగ్రత్త
రచన::జీ వీ నాయుడు
అహంకారం వద్దు
అలంకారం ముద్దు
హద్దులు దాటవద్దు
తస్మాత్ జాగ్రత్త..
మాట జారినా
మనసు జారినా
పెను ప్రమాదమే
తస్మాత్ జాగ్రత్త
మాట ఇవ్వకు
ఇస్తే మరువకు
మరిస్తే అరవకు
తస్మాత్ జాగ్రత్త
అపకారం వద్దు
ఉపకారం ముద్దు
మమకారం హద్దు
తస్మాత్ జాగ్రత్త