భూదేవి

భూదేవి

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

తాపీగా కాలుమీద కాలేసుకొని పేపర్ చదువుతూ ఉన్న భూపాల్ భూదేవి గార్మెంట్స్ ప్రొప్రెయిటర్.పేరు మోసిన బిజినెస్ మేన్.చిన్న వయసులోనే అన్ని మెలకువలు నేర్చుకున్న ర్యాపిడ్ ఫైర్ అంటూ ఉంటారు జనం.అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు అంత ఆస్తి ఉన్నా నా అన్న వారెవరూ లేకపోవడంతో పెళ్ళి గీత లేనట్లుంది వచ్చే జన్మ వరకూ ఆగాల్సిందే నంటూ స్వాములు కూడా సెలవిచ్చారు.ఇక చేసేదేమీలేక సంపాదన మీద పడి తిండి తిప్పలు కూడా సరిగా చేయకుండా జీవనం సాగిస్తున్న భూపాల్ జీవితంలోకి ఒక మెరుపు తీగ ఎంట్రీ ఇచ్చింది.

క్యాష్ కౌంటర్లో కూర్చుని డబ్బులెక్కేస్తున్న భూపాల్ ను సమీపించిందో అమ్మాయి.
సార్ నాకు ఈ రోజు సెలవు కావాలి అంది.సెలవా నువ్వు డ్యూటీకి వచ్చావం కదా మధ్యలో సెలవేంటి అన్నాడు.
నాకు హెల్త్ బాగలేదు అందుకే విశ్రాంతి కావాలి అనడంతో మొన్న కూడా ఇలాగే చెప్పావ్ ఇక్కడే కాసేపు రెస్ట్ తీసుకో సరిపోద్ది అంటూ తన పనిలో తను నిమగ్నమయ్యాడు.
ఆ అమ్మాయి నేను ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి అంటూ గట్టిగా అరవడంతో కస్టమర్లంతా ఏమైందోనని చూస్తూ ఉన్నారు.భూపాల్ కి కోపం వచ్చి ఏం తిక్క తిక్కగా ఉందా నా ముందే అరుస్తున్నావ్ అన్నాడు.పెళ్ళీ పెడాకులు లేని మీకు మా ఆడాళ్ళ బాధలెలా తెలుస్తాయి.నేను ఇంటికి వెళ్ళాలి మా ప్రాబ్లం మీకు చెప్పినా అర్థం కాదు అంటూ గద్దించడంతో ఏం పేరు నీ పేరు జీతం కట్ చేస్తా ఏమనుకున్నావో అన్నాడు భూపాల్.ఆ అమ్మాయి నాపేరు భూదేవి అంది.ఓయ్ నిజం పేరు చెప్పు ఆ పేరు మా నానమ్మది.అందుకే ఈ షాపుకాపేరు పెట్టా అన్నాడు.
భూదేవి నాపేరు అదేనండీ అంది.సరే నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అన్నాడు.పబ్లిక్ లో లేడీని నీ ప్రాబ్లం చెప్పు అంటున్నావ్ నీకు అక్కాచెల్లెళ్ళు లేరా అంది భూదేవి.ఎందుకు లేరు ఒకప్పుడు ఉండేవారు ఇప్పుడు లేరు మా అక్కంటే నాకు చాలా ఇష్టం మా అమ్మా నాన్న చనిపోయాక నన్ను ఎవరూ పట్టించుకోలేదు అందుకే వాళ్ళంటే నాకు గిట్టదు.నా సొంత కాళ్ళపై నిలబడ్డా.ఆడాళ్ళు పెళ్ళయ్యాక తను తన భర్త అంటూ స్వార్థానికి బ్రాండ్ అంబాసిడర్లు అయిపోతారు.అమ్మా నాన్న ఇరవైయేళ్ళు పెంచిన కష్టాన్ని పెళ్ళి అనే ఒకే బంధంతో తెంపేసుకుంటారు.పద్దెనిమిదేళ్ళయింది నేను మా అక్కని చూసి,మీకే బాధలూ ఉండవు ఎందుకంటే మగాడు కష్టపడి సంపాదిస్తుంటే కూర్చుని తినడమే కదా మన పని అన్నాడు భూపాల్.కూర్చుని తినే యోగమే ఉంటే నేను మీ దగ్గర పనికెందుకు వస్తాను అంటూ నన్ను ఇంటికి పంపిస్తారా పంపించరా అంది.
భూపాల్ నీ ప్రాబ్లం చెవిలో చెప్పు నమ్మబుద్దేస్తే పంపిస్తా అనడంతో భూదేవికి భూపాల్ ప్రవర్తన నచ్చలేదు సరేనంటూ చెవిలో ఏదో చెప్పింది.అది విన్న భూపాల్ కోపంతో ఊగిపోయాడు.ఈరోజే నిన్ను పనిలోంచి తీసేస్తా అంటూ తిట్టడం ప్రారంభించాడు.అయినా భూదేవి జంకడం లేదు.ఓర చూపుతో భూపాల్ ని చూస్తూ తన పని చేసుకుంటూ ఉండగా తన తోటి మిత్రులు ఏమైందే అన్నారు.ఏముంది మళ్ళీ సెలవడిగానని తిడుతున్నాడు.నన్ను తిట్టడమే కదా పని అనడంతో ఒక మిత్రురాలు “ఏమే నాలుగురోజులకొకసారి సెలవడిగితే ఎవరిస్తారు చెప్పు ఆయనేమైనా నీ మొగుడా అని ఎగతాళి చేశారు.ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అంటూ భూదేవి నేరుగా లేచి బయటికి వెళ్ళిపోయింది. భూపాల్ కూడా వెనుకనే వెళ్ళాడు.పని వాళ్ళంతా ఏంజరుగుతుందా అనుకుంటూ ఆలోచనలో పడ్డారు.
భూపాల్ కాసేపటికి వచ్చేశాడు.భూదేవి కూడా వచ్చేయడంతో ఏం జరుగుతూ ఉందో అర్థం కావట్లేదు.ఒకరినొకరు సిగ్గుపడుతూ చూసుకుంటున్నారు.వారి నవ్వులు షాపంతా చిలిపి తనంతో నిండిపోయేలా చేశాయి.సాయంత్రం అయింది ఒకాయన వచ్చి భూపాల్ ని తీసుకెళ్ళాడు.షాపు మూసే సమయానికి కూడా రాకపోవడంతో భూదేవి షాపు మూసుకొని తాళాలు తన దగ్గర పెట్టుకోవడంతో ఒక మిత్రురాలు “నువ్వెవరు భూదేవీ..నీకూ భూపాల్ కి ఏంటి సంబంధం.నువ్వొచ్చినప్పటి నుంచి ఆయనతో ఏదో ఒక గొడవ పెట్టుకొని కౌంటర్ దగ్గరే ఉంటూ ఉండడం చూసి మాకు డౌట్ వచ్చినా అడగలేదు”అనడంతో నువ్వు ఇందాక అన్నావే ఆయనేమైనా నీక్కాబోయే మొగుడా అని ..ఆయన నాక్కాబోయే మొగుడు నేను మీక్కాబోయే అమ్మగార్ని అంటూ బాంబు పేల్చింది.
ఏంటి ఇదంతా నిజమా కాబోయే భార్యవా లేక హద్దులు దాటిన చిలకవా అని ఒకతను అనడంతో భూదేవి ఏం జరిగిందో చెప్తా వినండి “భూపాల్ మా అమ్మకి స్వంత తమ్ముడు.నాకు మేనమామ. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పట్టించుకోక పోవడంతో సిటీకొచ్చి గార్మెంట్ షాపుల్లో పని చేస్తూ పెద్దవాడై తనే స్వంతంగా ఈ భూదేవి గార్మెంట్ షాపును పెట్టాడు. మాకు ఈ మధ్యనే తెలిసింది మా మామ పెళ్ళీ పెడాకులు లేకుండా ఒంటరిగా ఉంటూ బాధపడుతున్నాడని.అమ్మంటే ఆయనకి పడదు అందుకే నేనొచ్చి ఇలా గొడవపడుతూ మా మామకి దగ్గరయ్యా అని చెప్పింది.సరే ఇందాక చెవిలో ఏం చెప్పావ్ అని అడగడంతో “ఐ లవ్ యూ మామయ్యా “అనడంతో ఆయనకి నేనెవరో తెలిసిపోయి తిట్టాడు.బయటికెళ్ళిపోయాక నేనేమైనా చేసుకుంటానని భయపడి నా వెనుకే వచ్చాడు.నేను నన్ను పెళ్ళి చేసుకోక పోతే నేను బతకను అని అనేసరికి సరేనని ఒప్పుకొని వచ్చాడు.మా నాన్న సాయంత్రం వచ్చి ఇంటికి తీసుకెళ్ళాడు.అని చెప్పడంతో ఒకాయన “అంటే భూపాల్ కి డబ్బుందని పరిగెత్తుకొచ్చారు.లేకుంటే వదిలేసే వారు కదా “అన్నాడు.”లేదు అన్నా..మా అమ్మ కి మామయ్యకి చిన్నప్పటి నుంచి పడేది కాదంట .అదీ కాక మా అమ్మది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్.అందుకే మా వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చనిపోయాక రమ్మంటే రాలేదంట.ఒక్కడే పట్టుదలతో ఇంతెత్తుకెదిగాడు.నాకూ మామయ్యకి ఏజ్ డిఫెరెన్స్ ఎక్కువయినా ఇన్ని రోజులు మేము ఉండి కూడా కష్టాలు పడ్డాడు.ఇక సుఖపెడదామని నేను కూడా పెళ్ళికి ఒప్పుకున్నా “అంటూ తన త్యాగాన్ని కూడా రంగరించి చెప్పింది.సరేనమ్మా నీ పేరు ఏంటి భూదేవేనా అన్నారు.కాదు నా పేరు భూమి అంటూ అసలు పేరు చెప్పింది.సరేనమ్మా మా భూపాల్ అమాయకుడు కొంచెం చూసీ చూడనట్టు పో అని నవ్వడంతో మా మామయ్య అమాయకుడా నేను షాపులో అల్లరి చేస్తుంటే నన్ను ఒక కంట కనిపెట్టి ఆయన్ని లైన్ లో పెడుతున్నానని అర్థం చేసుకొని నన్ను చూసీ చూడనట్టు నటించాడయ్యా బాబు అంటూ వాపోయింది.ఇంతలో భూపాల్ వచ్చి కథంతా చెప్పేశావా మీ ఆడాళ్ళ నటిలో ఏమీ దాగదు కదా అనడంతో అబ్బా మీ మగాళ్ళు మాత్రం తక్కువా అంటూ మామ భుజంపై చెయ్యేసి బైక్ పై ఇంటి బాట పట్టారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!