సద్విమర్శ ఆమోదయోగ్యం!

(అంశం :: “విమర్శించుట తగునా”)

సద్విమర్శ ఆమోదయోగ్యం!

రచన::బిహెచ్.వి.రమాదేవి

విమర్శ అంటే తెగడడం కాదు!
బాగుంటే ఎందుకు బాగుందో!
బాగోక పోతే ఎందుకుబాగోలేదో
వివరించి చెప్పడం విమర్శ!

అన్ని విమర్శలు బాధించవు!
కొన్ని విమర్శలు పట్టుదలను
పెంచి ప్రతిభ పెంచుతాయి!
మరికొన్ని మన గొప్పతనం కి,

ఇంకొన్ని మనలను సరిజేసి,
ఉన్నత స్థాయికి చేర్చు తాయి
బాధ పడినా బాధ్యత పెంచి.
మన జ్ఞానం వెలికి తీస్తాయి.

ఏకాంతంలో విమర్శించి,
నలుగురిలో ప్రశంసించి,
నీ లోకదలిక నిచ్చే విమర్శ,
ఎప్పుడూ కావాలి నేస్తం!

నిన్ను బాధించే వారికి
అందనంత ఎత్తుకు ఎదిగి,
వాళ్ళు వేసిన రాళ్లతో నిర్మించుకో భవనం!
అదే నీ విజయానికి మూలం!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!