అస్త వ్యస్థం

అస్త వ్యస్థం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : కందర్ప మూర్తి

కరోనా కాలనాగు కాటుకు
విలవిల లాడుతున్నారు జనం
కులాల కక్షలతో మసౌతున్నారు యువత
మతపిచ్చితో రెచ్చగొడుతున్నారు మతోన్మాదులు
ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కులాలు మతాలు
మానవ ప్రేరితమే ఈ ఆంక్షలన్నీ
ఎవరి రక్తం చూసినా ఎరుపే
అందరి ఊపిరి ఆ గాలే
అందరికీ వెలుగిచ్చేది ఆ సూర్యుడే
ఏ కులమైనా ఏ మతమైనా ఆ పరమాత్మ పుట్టుకే
క్షణ భంగురమైన జీవితం కోసం ఎందుకీ ప్రాకులాట
తెలుసుకో మానవా!సార్థకం చేసుకో నీ బ్రతుకు
నిస్వార్థ సమాజ సేవలో తరించు పరమాత్మ ప్రేమలో

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!