తెలంగాణా మహా కుంభమేళా

తెలంగాణా మహా కుంభమేళా
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

తొమ్మిది శతాబ్దాల ఘణ చరిత
సుప్రసిద్ధ గిరిజన జాతరగా గణత
మహోత్సవమై ఖండాంతర ఖ్యాతి
తెలంగాణా మహా కుంభమేళా
కలియుగ దేవతలుగా పూజలు
సమ్మక్క సారలమ్మల భరణి రూపాలు
కన్నెపల్లి నుంచి ఆగమనం
చిలుకల గుట్టన కొలువుదీర్చి
కొలిచేరు భక్తులు సేవించి
గిరిజన సంస్కృతికి ఆలవాలం
జంపన వాగులో స్నానాలు
బంగారం అని పిలిచే బెల్లం నైవేద్యాలు
రెండు సంవత్సరాలకో మారు
మాఘ పూర్ణిమ సుదినం
భక్తజన సంద్రమే మేడారం
చూసి తరించాలి ఓ మారు

You May Also Like

10 thoughts on “తెలంగాణా మహా కుంభమేళా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!