జీవితం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: అలేఖ్య
ప్రతి రోజు ఓ వరం
మరో ఉదయానికి నవ్వుతూ
చుట్టాలి శ్రీకారం
కష్టసుఖాల జీవిన సంగమంలో
ఎదుర్కోవాలి ఎన్నెన్నో
సుడిగుండాల ప్రవాహాలు
పోరాడాలి ప్రతి క్షణం
నీతో నీవు ధీటుగా
ఆశాధ్రుక్పదంతో అనునిత్యం
రేపటి రోజు నువ్వు చూస్తావో
లేదో ఎవరు చెప్పగలరు
నీ చేతిలో ఉన్న ప్రతి నిమిషం
ఎంతో అమూల్యం
ఖర్చు చేయాలి ప్రతి ఘడియని
ప్రేమతో, ఆశతో, పట్టుదలతో,
నవ్వుతో ప్రతి నిమిషం జీవితాంతం
జీవితం ఎన్నో గొప్ప అనుభవాల
భావోద్వేగాల భాండాగారం
మన ఊహకందనిది
సంద్రమంత లోతైనదే జీవితం