సున్నితాలు

సున్నితాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చంద్రకళ. దీకొండ

కరువుతో తల్లడిల్లిన కోయదొరలు
కప్పం కట్టలేక కడగండ్లపాలైరి
కాకతీయసైన్యంతో చేసిరి పోరాటం
చూడచక్కని తెలుగు సున్నితంబు…!

జంపన్న స్మృతిచిహ్నమై సంపెంగవాగు
పుత్రుని మరణవార్తతో సమ్మక్క
రౌద్రమూర్తియై కదనరంగానికి కదిలే
చూడచక్కని తెలుగు సున్నితంబు…!

వీరనారియై విజృంభించెను సమ్మక్క
సైనికుడు పొడిచె వెన్నుపోటు
నెమలి నారచెట్టుక్రింద కుంకుమభరిణయై వెలిసె
చూడచక్కని తెలుగు సున్నితంబు…!

ప్రతాపరుద్రుడు కప్పాన్ని రద్దుచేసె
సమ్మక్కకు కానుకలను అర్పించె
రెండేళ్లకోమారు జాతర జరుపమనె
చూడచక్కని తెలుగు సున్నితంబు…!

“కుట్రలు, కుతంత్రాలతో అధికారమందరాదు”
“ప్రతి వ్యక్తీ వీరునిగానే జీవించాలి”
సందేశమిస్తున్నట్లుగా గద్దెపై సమ్మక్కసారలమ్మలు
చూడచక్కని తెలుగు సున్నితంబు…!

వెదురుకర్ర, కుంకుమభరిణలు ప్రతిరూపాలుగా
ధైర్యసాహసాలకు, ఆత్మత్యాగానికి గుర్తుగా
శివసత్తుల శివాలతో కదనరంగమాయె
చూడచక్కని తెలుగు సున్నితంబు…!

మాఘమాసంలో జరిగే
మేడారంజాతర
బెల్లమే బంగారమై భాసిల్లుతూ
ఆసియాఖండంలోనే అతిపెద్ద గిరిజనజాతర
చూడచక్కని తెలుగు సున్నితంబు…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!