నానీలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: చింతా రాంబాబు
కన్నవారి కళ్ళల్లో
ఆనందపు మెరుపులు
బిడ్డల
ఎదుగుదల చూసి
నీవు లేక నా నవ్వు
శిశిరం లో
ఆకులురాలిన
కొమ్మయ్యింది.
విజయం
తలుపు తట్టింది
ఓటమి
భయంతో పారిపోయింది.
నీ జ్ఞాపకం
నా ఎదలో
తీరందాటే తుఫాన్ లా
విరుచుకు పడుతుంది