నా వన్నెల వెన్నెల

నా వన్నెల వెన్నెల

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

ఓ ప్రేయసీ, నీతో గడిపిన మధుర క్షణాలు
గుర్తుకు వస్తున్నాయి.  నాతో ఏడడుగులు
వేసి, నా జీవితంలో నువ్వు ఇంద్రధనుస్సు
వోలె అందాల బాట వేస్తావని మురిసాను.

కానీ,
నువ్వు  ‘చిరుజల్లుల’ మాయాజాల ముసుగులో
‘కిరణ్’తో జత కలిపి, అదే జీవనబాట అనుకుని,
ఇంద్రజాలమైన ఇంద్రధనుస్సు అనే వలలో చిక్కి,
ముళ్ళపొద పొదిలో ఇరుక్కున్నావని తెలుసుకో.

అయితే,
నేను మాత్రం నన్ను ప్రేమించే నా వాళ్ళ కోసం
సుమనోహర భావాల కలలు కంటూ, ఆకసంలో
ఆనందాల పొదరిల్లు కట్టుకుని, నన్ను నన్నుగా
ప్రేమించే వారికోసం వన్నెల వెన్నెల్లో విహరిస్తా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!