శాంతి వర్ణం
రచన: చంద్రకళ. దీకొండ
మధురానుభూతుల ఊదా…
వేదనా మబ్బుల నీలి…
ఆనందాల ఆకుపచ్చ…
శుభాకాంక్షల పసుపు…
ప్రశాంత నారింజ…
ఆవేశాల ఎరుపు…!
మరెన్నో భావోద్వేగాల మేళవింపుతో…
ఎనలేని భావాల కలగలుపుతో…
గీసిన మనోచిత్రం…
ఇంద్రధనువులా సుందరం…!
అన్ని వర్ణాలు కలిసిన…
తెల్లని చిరునవ్వుల శ్వేత
శాంతి వర్ణం…
ఆహ్లాదమే…
మనోహరమే…!!!