మనసు తపన

(అంశం::” ప్రేమ”)

మనసు తపన

రచయిత :: v. కృష్ణవేణి

కాలేజీ చదువుకునే రోజులలో లల్లీ అనే అమ్మాయి, కృష్ణ అనే అబ్బాయి. మంచి స్నేహితులు.ఇద్దరు ఒకరి కొకరు ఇష్టంగా ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు.ఇలా కొంతకాలం గడుస్తుంది.వాళ్ళ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇక్కడ వారి ఇద్దరి కులాలు వేరే. అయిన వాళ్లకు తెలుసు.
అమ్మాయి ధనిక కుటుంబం గల అమ్మాయి అయిన కృష్ణను పెళ్లిచేసువడానికి ఒప్పుకుంది. కానీ కులాలు వేరుకావడం వల్ల లల్లీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు.అయినగాని లల్లీ కృష్ణనే చేసుకోవాలని నిర్ణయించుకుని కృష్ణ దగ్గరకు వెళ్తుంది. కృష్ణకు లల్లీ అంటే ప్రాణం. కృష్ణ తనదగ్గరకు వచ్చిన లల్లిని చూసి చాలా ఆనందపడతాడు. లల్లీ ఇద్దరం ఎక్కడికయినా వెళ్లి పెళ్లి చేసుకుందాం. తనను పెళ్లి చేసుకోవడం మా పెద్దవారికి ఇష్టంలేదు. మనలని మా పేరెంట్స్ కలవనివ్వరు. అనిచెబుతుంది. కృష్ణ చాలా ఆలోచించాడు
లల్లిని పెళ్లి చేసుకోవడం కృష్ణకు ఇష్టమే అయినగాని పెద్దల మాట కాదనకూడదు. వాళ్ళను బాధపెట్టకూడదు. పెద్దలు చూసిన పెళ్లిసంబంధనే చేసుకోమని చెప్పి పంపించేస్తాడు. తరువాత కృష్ణ చాలా ఆలోచించాడు. తన కోసం వచ్చిన అమ్మాయిని పంపించి చాలా తప్పు చేసానని ప్రేమించిన అమ్మాయిని వదులుకోకూడదని నిర్ణయిచ్చుకుని అమ్మాయిని కలవడానికి వెళ్తాడు. అప్పటికే అమ్మాయికి పెళ్లి నిర్ణయిచ్చారు.ఎలాగయినా లల్లిని కలవాలని ప్రయత్నిస్తాడు. ఎలాగయినా కలిచాడు లల్లిని బ్రతిమాలాడు నిన్ను నేను పంపించి తప్పు చేసానని నువ్వులేకపోతె నేను ఉండలేనని బ్రతిమాలాడు. లల్లీ ఒప్పుకోలేదు. పరిస్థితి చేయి జారిపోయింది. ఇక నిన్ను పెళ్లి చేసుకోలేనని. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పి పంపించేస్తుంది. కృష్ణ మాత్రం చేసినపొరపాటు తలుసుకుని లల్లిని వదిలి ఉండలేక లల్లి నిశ్చితార్థం రోజు ఫోన్ చేసి బ్రతుమాలాడతాడు. అయిన లల్లి ఒప్పుకోలేదు. ప్రేమించిన అమ్మాయి సుఖంగా ఉండాలంటే తనకు దూరంగా ఉండాలని తనని వదిలేయమని అడుగుతుంది. చేసేది ఏమిలేక కృష్ణ లల్లికి దూరంగా ఉంటాడు. అలా లల్లికి పెళ్లి జరిగిపోతుంది. ఇలా కొంతకాలం గడుస్తుంది. లల్లికి పిల్లలు పుడతారు. కానీ కృష్ణ మాత్రం లల్లిని మర్చిపోలేక పోతాడు. తను ఎలా ఉందొ అని తెలుసుకుంటూనే ఉంటాడు. కొంతకాలానికి వేరొక అమ్మాయి పరిచయం అవుతుంది. వాళ్లిద్దరూ స్నేహితులు మాత్రమే. కృష్ణ జరిగినాదంతా ఆ అమ్మాయికి చెబుతాడు. ఆ స్నేహితురాలయినా అమ్మాయి కృష్ణ చాలా తప్పు చేసావు ప్రేమించిన అమ్మాయిని వదులుకోకూడదు అని అంటుంది. అయిన చేసింది మంచే మీస్వార్థం కాకుండా పెద్దవాళ్ళ కోసం మీ ప్రేమను త్యాగం చేసారు. అనిఅంటుంది. అలా కొంతకాలం తరువాత లల్లితో మాట్లాడాలని, లల్లిని చూడాలని అనుకుని స్నేహితురాలి సహాయం కోరతాడు. కాని ఆ స్నేహితురాలు పెళ్లి అయిన అమ్మాయిని ఇంక ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకూడదని చెబుతుంది. ఎక్కడయినా కనిపిస్తే తను ఎలా ఉందొ అడిగి తెలుసుకోమని చెబుతుంది. కృష్ణ సరే అని తన ప్రేమను చంపుకోలేక లల్లిని మర్చిపోలేక లల్లీ కోసం లల్లీ ఎలాఉందో తెలుసుకోవడం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!