జర జాగ్రత్త సుమా

(అంశం:” ప్రమాదం”)

జర జాగ్రత్త సుమా

రచన::మక్కువ. అరుణకుమారి

హాయి హాయిగా సాగే పయనంలో
హాఠాత్తుగా ఎదురయ్యే ప్రియమైన శత్రువు ప్రమాదం
అది గమనమైనా, జీవిత గమనమైనా!

ప్రశాంత జీవనాన్ని ఆసాంతం కబళిస్తుంది
తుఫానులా చెలరేగి కల్లోలం సృష్టిస్తుంది

అపరిచిత లోకాన్ని పరిచితం చేస్తుంది
మాయల జలతారు వలలో బంధింప జేస్తుంది

ముద్దుగులాబీల మురిపాలతో పాటు మెత్తని ముళ్ళ గాయాలు చేస్తుంది

మొగలిరేకుల సౌరభాలతో పాటు
విషపునాగులా కాటేస్తుంది

మోదం ఇస్తుందని,గుమ్మంలోకి వచ్చిందని
ఎదురేగి ఆహ్వానించకుమా
ప్రమోదాల ప్రమాదాన్ని!

ప్రమాద ఘంంటికల సవ్వడిని
పసిగట్టుమా,జర జాగ్రత్త సుమా!
********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!