జై జవాన్!

జై జవాన్!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు

జై జవాన్
“కదం, కదంలో నీ దేశభక్తి అడుగులు మున్ముందుకు  సాగాలి ఓ సైనికుడా!”
‘అత్యంత శీతల వాతావరణంలో,  మంచుకొండల్లో, శ్వాస ఆడక పోయినా, నరాలు బిగుసుకు పోతున్నా, నీ దేశం కోసం అమూల్యమైన నీ అడుగులు ముందుకు సాగాలి ఓ వీర సైనికుడా,
“తలలు తెగిపోయినా  పర్వాలేదు, కానీ మీ దేశభక్తి ‘హిమాలయా పర్వతాల’ కన్నా ఎత్తుగా ఉండాలి, చస్తు, చస్తూ కూడా దేశ రక్షణ కోసం ఆనందంగా ప్రాణాలు అర్పించడం నీకే సాటి సైనికుడా!
“బ్రతికి ఉండడానికి చాలా సమయం ఉంది, కానీ నీ ప్రాణ త్యాగం చేయవలసిన రోజు రానే వచ్చింది, సంసార సుఖం త్యాగం చేసి దేశం కోసం అనుదినము పోరాటపటిమను  కనబరుస్తున్న ఓ సైనికుడా!
“యుద్ద భూమి లో అనుక్షణము రక్తం చిందిస్తూ, ‘ భరత మాత ‘ సరిహద్దులలో ‘లక్ష్మణ రేఖ గీస్తూ,  గీత దాటి వచ్చే ‘రావణు లను ‘చీల్చి చెండాడుతు, మన జాతి గౌరవాన్ని, పవిత్రతను కాపాడుతున్న  ఓ వీర  సైనికుడా”!
“మీరే ‘రామలక్ష్మణులు ‘అయి భరత దేశ రక్షణకు ఆనందంగా అమరులైన మీకు శత సహస్రకోటి వందనాలు .. జై! జవాన్.”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!